టీవీ: మరో వివాదం సృష్టించిన కస్తూరి..!
ఇక ఈ క్రమంలోనే తాజాగా మరొక వివాదంలోకి అడుగు పెట్టింది . ఇద్దరమ్మాయిల గురించి ఒక పర్సనల్ వీడియోని షేర్ చేస్తూ కొత్త వివాదానికి తెరలేపింది. ఇక ఆ వీడియో మరొకసారి విమర్శల పాలు చేసిందని చెప్పాలి. అయితే ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. ఆ వీడియోలో ఇద్దరమ్మాయిలు మద్యం దుకాణానికి వెళ్లి మద్యం కొంటుండగా బాగా తాగండి అమ్మాయిలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఇది వాట్సప్ ఫార్వర్డ్ లోని వీడియో అని కూడా ఆమె చెప్పింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది.
అంతేకాదు ఇది చూసిన చాలా మంది ఆ అమ్మాయిల వ్యక్తిగత విషయం అది.. దీన్ని ఎందుకు షేర్ చేసావు అంటూ ఈమెను ప్రశ్నిస్తున్నారు.. సింగర్ చిన్మయి కూడా ఈ వీడియోపై స్పందించి నిజాయితీగా చెప్పాలి అంటే ఇలాంటి వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది నెటిజన్స్ కూడా చిన్మయికి మద్దతు పలుకుతూ. కామెంట్లు చేస్తూ కస్తూరిని టార్గెట్ చేస్తున్నారు.. అంతేకాదు అమ్మాయిలను మందు తాగమని ఎంకరేజ్ చేస్తున్నావా? లేక వ్యతిరేకిస్తున్నావా? అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కస్తూరిపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.