TV: పటాస్ ప్రవీణ్ తో ఫైమా బ్రేకప్.. ఆ సినిమా ఎఫెక్టేనా..?

Divya
సాధారణంగా తెలుగు బుల్లితెరపై అమ్మాయిలు ఎక్కువగా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే లేడీ కమెడియన్లుగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే.. మరి కొంతమంది గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక కామెడీతోనే ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో జబర్దస్త్ ఫైమా కూడా ఒకరు. తన అద్భుతమైన టాలెంట్ తో అదరగొడుతున్న ఈమె వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరియర్ ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తోంది.

అదే టాలెంట్ తో బిగ్ బాస్ లో కూడా అవకాశం దక్కించుకొని మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె పటాస్ ప్రవీణ్ తో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడికి ఆమె బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చింది.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఫైమా ప్రొఫెషనల్ లైఫ్ మాదిరిగానే పర్సనల్ లైఫ్ లో కూడా సక్సెస్ఫుల్గా వెళుతోంది. పటాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచే ప్రవీణ్ తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ స్వయంగా తనను ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. అప్పటినుంచి వీళ్ళిద్దరూ చట్టపట్టలేసుకొని మరీ తిరుగుతున్నారు. అంతే కాదు యూట్యూబ్లో కలిసి వీడియోలు చేస్తూ తెగసందడి చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఫైమా తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.  ఇందులో బేబీ సినిమా చూసిన తర్వాత ప్రవీణ్ తో ఫైమా బ్రేకప్ అని ఉండడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.  అయితే వీళ్ళిద్దరూ కలిసి బేబీ సినిమా స్పూఫ్ వీడియో చేయగా అందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఫైమా ఈ పోస్ట్ చేసినట్లు ఆ తర్వాత అర్థమవుతుంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఫైమా వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అయినట్లు కూడా ఉండడంతో అందరూ దీనినే హైలెట్ చేస్తూ ఫైమా అతడిని పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: