టీవీ: ఇల్లు అమ్మేస్తున్న జబర్దస్త్ నటుడు.. కారణం తెలిస్తే కన్నీళ్ళాగవు..!

Divya
తెరపై నవ్వులు పూయిస్తూ.. తెర వెనుక ఎన్నో కష్టాలు పడుతున్న సెలబ్రిటీల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైకి సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ కూడా వీరి మనసులో ఎన్ని కష్టాలు ఉంటాయో.. పడే వారికి మాత్రమే అర్థమవుతుంది.. రోజు మొత్తం అలసిపోయిన వారికి జబర్దస్త్ అనేది ఎంతో రిలీఫ్ ఇచ్చే షో.. ఇప్పుడు ఎలా ఉంది అన్నదానికంటే ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మాట్లాడుతుంటే బాగుంటుందేమో.. ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత టీవీ షోలు చూడడానికి ప్రేక్షకుల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

మరొకవైపు జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపునందుకొని వరుస షోల తో దూసుకుపోతున్నారు. అందులో శాంతి స్వరూప్ కూడా ఒకరు. బక్క పలుచని దేహం.. అబ్బాయిగా కన్నా అమ్మాయిగా కానే ఎక్కువగా కనిపిస్తూ శాంతి స్వరూప్ కాస్త శాంతిగా మారాడు.  పొట్టకూటికోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈయన పాలిట జబర్దస్త్ వరం గా మారింది. ఇక శాంతి స్వరూప్ వెనుక ఉన్న కష్టాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి . ఈ మధ్యనే ఒక ఇల్లు కొన్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ ఇంటిని అమ్మేస్తున్నట్లు తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపారు.

తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని.. ఆమెకు సర్జరీ చేయించాలని.. అయితే సర్జరీ చేయించడానికి తన వద్ద సరిపడా డబ్బు లేదని.. అందుకే తన ఇంటిని కూడా అమ్మేస్తున్నట్లు తెలిపాడు. ముఖ్యంగా తనకు తన తల్లి కంటే ఏది ఎక్కువ కాదని.. ఈ విషయం అమ్మకు చెప్తే ఒప్పుకోదు కాబట్టే ఆమెకు తెలియకుండా అమ్మేస్తున్నాను అంటూ తెలిపారు. ఇక అందుకు సంబంధించిన వీడియో విడుదల చేయగా అది చూసిన అభిమానులు అధైర్య పడకు .. మీ అమ్మ త్వరగా కోలుకుంటారు .. తల్లి కోసం నువ్వు చేస్తున్న త్యాగం చాలా గొప్పది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: