టీవీ: వాడు నాకు కాలి కింద మట్టికి కూడా సరిపోడు - రోహిణి..!
సీరియల్ నటిగా కెరియర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో తో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె సినిమాలలో కూడా నటిస్తోంది. ఒక ప్రమాదం కారణంగా కొన్నాళ్లు షోలు సినిమాలకు దూరమైన రోహిణి ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఒక షోలో భాగంగా తన ఫస్ట్ లవ్ బ్రేకప్ గురించి పెదవి విప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే రోహిణి జీవితంలో కూడా ఇన్ని కష్టాలు ఉన్నాయని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రోహిణి మాట్లాడుతూ.. నాకు కూడా ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ కొన్నాళ్లకే అతనితో బ్రేకప్ అయిపోయింది. ఆ బ్రేకప్ తర్వాత ఎంతో నరకం చూసాను. ఆ టైంలో నాకు ఫ్రెండ్స్ మాత్రమే అండగా నిలిచారు.. అసలు వాడెవడు.. నీ కాలి కింద మట్టికి కూడా వాడు సరిపోడు అంటూ ధైర్యం చెప్పేవాళ్లు. ఆ తర్వాత నాకు కూడా అదే నిజం అనిపించింది. ఇక వాడొక ఆఫ్ట్రాల్ అని, వాడి గురించి ఆలోచించడం తగ్గించాను. నా స్నేహితుల వల్లే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రోహిణి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.