టీవీ: ఆ హీరోతో ప్రేమాయణం నడిపిన వర్షిణి.. చివరికి..?
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో అభిజిత్.. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసి చిరంజీవి చేత ట్రోఫీని కూడా అందుకున్నారు. ఇక ఈ షో ద్వారా ఈయనకు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అవకాశాలు రాలేదు.కానీ పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ చేసే అవకాశం వచ్చింది. అందులో వర్షిణి లీడ్ రోల్ పోషించింది. మొదటి సీరీస్ చేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా .. రెండవ సీరీస్ కి అది కాస్త ప్రేమగా మారిందని చెప్పాలి.
ఇకపోతే అప్పటికే ఇంకొకరితో ప్రేమలో ఉన్న వర్షిణి పెళ్లిగోల వెబ్ సిరీస్ లో అతడిని కాదని అభిజిత్‌తో ఎఫైర్ నడపడంతో ఆ విషయం తెలుసుకున్న అతడు ఈమెకు బ్రేకప్ చెప్పేసాడు. ఇక అదే సమయంలో అభిజిత్ అవకాశాలు లేక ఒంటరిగా ఇంటికే పరిమితం అవడంతో వర్షిణికి అటు యాంకర్ గా , ఇటు సినిమాలలో అవకాశం లభించింది. అదే సమయంలో హైపర్ ఆదితో ఆమె ఎఫైర్ నడుపుతోందని వార్తలు కూడా వినిపించాయి. దీంతో అభిజిత్ కూడా ఈమెకు బ్రేకప్ చెప్పేసాడు. మరొకవైపు ఒక క్రికెటర్ తో కూడా ఈమె ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించినా.. అందులో నిజం లేకపోయింది. ఏది ఏమైనా వర్షిణి లవ్ ఎఫైర్స్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటాయి.