టీవీ: రతిక నిజంగానే ఆ సింగర్ చేతిలో మోసపోయిందా..?
దీంతో రతిక సింగర్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ కి మాజీ ప్రియురాలు అని ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. రతిక గతంలో అంటే 2019లో రాహుల్ సిప్లిగంజ్ తో ఒక ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. ఇక రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నప్పుడు రతికాను కాదని పునర్నవి తో క్లోజ్ గా ఉండడం.. బయటకి వచ్చాక కూడా వారు రిలేషన్ లో ఉన్నారంటూ టాక్ రావడంతో రాహుల్, రతిక మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని సమాచారం.
ఇకపోతే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చినప్పుడు రతిక ఇదే విషయం గురించి గుర్తుచేసుకుంది. ఇక హౌస్ లోకి వెళ్ళాక కూడా బ్రేకప్ గురించి అడిగితే తన మాజీ లవర్ ను ఇంకా మర్చిపోలేక పోతున్నాను అంటూ ఆమె ఎమోషనల్ అయింది. ఇక నీ హార్ట్ బ్రేక్ చేసిన వాళ్ళని ఇమిటేట్ చేయమని అడిగితే అందుకు రతీక ఇప్పుడు పాట పాడాలా అంటూ ఇండైరెక్టుగా రాహుల్ గురించి చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని బ్రేకప్ అయ్యారని కూడా స్పష్టం అవుతుంది. ఇకపోతే గతంలో వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ అయిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.