టీవీ: బిగ్ బాస్ 7 కోసం నాగార్జున తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతంటే..?
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ లోకి ఈసారి కేవలం 14 మంది మాత్రమే అడుగుపెట్టగా.. మూడు వారాలకు గాను ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.. మొదటి వారంలో భాగంగా కిరణ్ రాథోడ్, రెండవ వారంలో భాగంగా షకీలా, మూడో వారం సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. నామినేషన్ లో భాగంగా రతికా రోజ్, టేస్టీ తేజ ఎలిమినేట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే సీజన్ 3 నుంచి ఆయన ఇప్పటివరకు హోస్ట్గా వ్యవహరిస్తూ ఒక్కొక్క సీజన్ కి ఒక్కో రకమైన పారితోషకం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
సీజన్ 3 కి హోస్టుగా చేసినప్పుడు మొత్తం సీజన్ కిగాను రూ .5కోట్ల పారితోషకం తీసుకున్న నాగార్జున ప్రతి సీజన్ కి ఆ మొత్తాన్ని పెంచుకుంటూ ఇప్పుడు ఎపిసోడ్కి రూ.15 లక్షల చొప్పున మొత్తం సీజన్ సెవెన్ కోసం ఏకంగా రూ.20 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సీజన్ 3 లో ఆయన ఎనర్జిటిక్ గా హోస్టింగ్ చేసి అందర్నీ మెప్పించారు. అయితే ఇప్పుడు ఆయనలో ఆ ఎనర్జీ కనిపించకపోయినా పారితోషకం మాత్రం బాగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.