TV: కట్టుకున్న భార్య ముందే ఆమెతో ఎఫైర్ పెట్టుకున్న ఈటీవీ ప్రభాకర్.. క్లారిటీ..!

Divya
బుల్లితెర మెగాస్టార్ గా ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటీవీ ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఎన్నో సీరియల్స్ లో లీడ్రోల్ పోషించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా బుల్లితెర పైన సీరియల్స్ చేస్తూనే మరొకవైపు పలుషోలలో సందడి చేస్తున్న ఈయన అంతకుమించి క్రేజ్ దక్కించుకున్నారని చెప్పాలి. సీరియల్స్ ద్వారా ఎంత పాపులారిటీ అయితే దక్కించుకున్నారో ఆ మధ్యకాలంలో ఎఫైర్స్ విషయంలో కూడా ఆయన అంతే వైరల్ గా మారారు.

గతంలో కట్టుకున్న భార్య ఉండగానే తన గర్ల్ ఫ్రెండ్ తో ఆయన ఎఫైర్ నడుపుతున్నారని వార్తలు కూడా వినిపించాయి అయితే ఈ విషయంపై తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో తన భార్య మలయజతో కలిసి పాల్గొన్న ఈటీవీ ప్రభాకర్ అసలు విషయం గురించి చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. నాపై వచ్చిన రూమర్స్ నిజమే.. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది.. అయితే ఆ తర్వాత కాలంలో తప్పు తెలుసుకొని నా భార్యకు క్షమాపణ చెప్పాను. అయితే తప్పు తెలుసుకొని నా భార్యకు క్షమాపణ చెప్పడం పెద్ద సంగతి కాదు కానీ నా తప్పును ఆమె క్షమించడం అతి పెద్ద విషయం.. నా భార్య నన్ను క్షమిస్తుందని అసలు ఊహించలేదు అంటూ ఈటీవీ ప్రభాకర్ తెలిపారు.

ఇకపోతే అందరి ముందే తాను ఒక అమ్మాయితో ఎఫైర్ నడిపాను అనే విషయాన్ని ఒప్పుకోవడంతో ఈటీవీ ప్రభాకర్ పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మలయజ, ఈటీవీ ప్రభాకర్ ల పెళ్లి విషయానికి వస్తే.. వీరిద్దరి పెళ్ళికి ఇంట్లో అంగీకరించలేదట. అందుకే రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన ఒక స్నేహితుడు కన్యాదానం చేశాడని , ఇక తమ పెళ్లికి స్నేహితులు మాత్రమే వచ్చారని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: