TV: బిగ్ బాస్ హౌస్ నుంచి శుభశ్రీ ఎంత తీసుకెళ్లిందో తెలుసా..?

Divya
తెలుగులో బిగ్గెస్ట్ రియాల్టీ షో గా ప్రసారమవుతున్న బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ ని కూడా జరుపుకుంటుంది. ఇకపోతే ఈసారి 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టగా అందులో ఏకంగా 5 మంది అమ్మాయిలే ఎలిమినేట్ అవ్వడం ఇక్కడ మరింత సంచలనం సృష్టిస్తోంది. మొదటి వారంలో భాగంగా కిరణ్ రాథోడ్ తెలుగు సరిగ్గా మాట్లాడటం లేదని ఆమెను ఎలిమినేట్ చేశారు.
 ఇక రెండవ వారంలో షకీలా ఎలిమినేట్ అవ్వగా.. మూడవ వారంలో దామిని ఎలిమినేట్ అయింది. ఇక నాలుగవ వారం ఎవరైనా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు. కానీ టైటిల్ ఫేవర్ అనుకున్న రతికా హౌస్ నుంచి వెళ్ళిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఐదవ వారంలో భాగంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. అందులో భాగంగానే శుభశ్రీ , గౌతమ్ కృష్ణ పేర్లు వినిపించాయి. వీళ్లిద్దరూ వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. కానీ గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూముకు పంపించి శుభశ్రీని ఎలిమినేట్ చేయడం జరిగింది.
ఇకపోతే ఇలా వరుసగా ఐదు మంది అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యేసరికి పురుషాదిక్యం ఎక్కువైందని బిగ్ బాస్ పై అందరూ మండిపడుతున్నారు. బిగ్బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయినందుకుగాను ఆమె ఐదు వారాలు హౌస్ లో ఉంది కాబట్టి ఎంత పారితోషకం తీసుకెళ్లింది అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. వారానికి రూ .2లక్షలు చొప్పున 5 వారాలకు గాను రూ.10 లక్షలు శుభశ్రీ తీసుకు వెళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎలిమినేట్ అవుతానని తాను కూడా ఊహించలేదు అంటూ ఇటీవల శుభశ్రీ వెల్లడించింది.ఇకపోతే వరుసగా లేడీ కంటెస్టెంట్ లనే ఎలిమినేట్ చేయడం కూడా వివక్షత చూపిస్తున్నారు అంటూ పలువురు నెటిజెన్లు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: