టీవీ: భగవంత్ కేసరిలో ఐదు నిమిషాల పాత్రకే రతిక భారీ రెమ్యునరేషన్..!
మరొకవైపు టాప్ 5 లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ నాలుగో వారమే ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చింది. ఇకపోతే ఈమె ఎలిమినేట్ అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న మళ్ళీ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలో మంత్రి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో రతిక ఐదు నిమిషాల పాటు కనిపించింది. ఈ క్రమంలోనే భగవంత్ కేసరి సినిమా కోసం అందులో నటించిన ఐదు నిమిషాల పాత్ర కోసం ఏకంగా లక్షల్లో పారితోషకం తీసుకుందట.
కేవలం ఐదు నిమిషాల కోసం రూ.2 లక్షల పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బాలయ్య సినిమాలో రతిక కనిపించేసరికి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయింది. అంతకు ముందు చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమె ఇప్పుడు రాఘవేందర్రావు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోందట. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇకపై తన ప్రవర్తనతో ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.