TV: అన్ని రూ.లక్షలు బిల్లు కట్టి మరీ రష్మీకి బహుమతి ఇచ్చింది ఎవరంటే..?
ఇదిలా ఉండగా బయట కూడా రష్మీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇటీవల జ్యువెలరీ షాప్ లో ఏకంగా రూ.6 లక్షల బంగారం కొనుగోలు చేస్తే ఆ బిల్లుని ఒక రాజకీయ నాయకుడు కట్టారు అని సమాచారం అందుతుంది. అంతేకాకుండా యాడ్ చేసినందుకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అడిగిందట ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. సాధారణంగా సెలబ్రిటీలు షాపింగ్ మాల్స్, జువెలరీ షాపుల ఓపెనింగ్ కి వెళ్లడం చాలా సహజం. అలా వెళ్తే ఆ షాపు వాళ్ళు ఎంతో కొంత వాళ్లకి గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు రష్మీ విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని అభిమానులు అంటున్నారు.
మరొకవైపు రష్మీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లు అవుతున్నా.. ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇంకొక వైపు సుధీర్ కూడా పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఎప్పటినుంచో అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా.. స్క్రీన్ పై బ్యూటిఫుల్ కపుల్ గా పేరు దక్కించుకున్న వీరు మాత్రం రియల్ లైఫ్ లో ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మరి రియల్ లైఫ్ లో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.