టీవీ: వధువుగా ఆవికాగోర్.. ఫొటోస్ వైరల్..!!

Divya
చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అవికా గోర్ దీంతో ఈమెకు మంచి పాపులారిటీ రావడంతో ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.తన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైన ఓటీటి లలో ఎక్కువగా నటించి మరింత క్రేజ్ అందుకుంది.
ఇటీవలే మ్యాన్షన్ -24 అనే వెబ్ సిరీస్లో నటించింది.ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ నేపథ్యంతో రావడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఆవికాగోర్ పెళ్లికూతురు గెటప్ లో కనిపించడం జరిగింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.అయితే ఈ ఫోటో కేవలం వధువు అనే ఒక వెబ్ సిరీస్ లో ఆవికాగోర్ నటిస్తున్నందువలన అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ పేరు కూడా వధువు అనే పేరుతో తెరకెక్కిస్తూ ఉన్నారు.

పెళ్లి దుస్తులలో నుదుట బాసింగం పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించిన ఆవికాగోర్ మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ గెట్ రెడీ ఫర్ అంటూ ఒక క్యాప్షన్ కూడా జత చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ నందు తదితరులు సైతం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ వధువు అనే వెబ్ సిరీస్ కూడా థ్రిల్లర్ జోన్ లోనే తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్మింగ్ కాబోతున్నట్లు సమాచారం.. చివరిగా పాప్ కార్న్ అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: