టీవీ: జబర్దస్త్ పై రాకింగ్ రాజేష్ కామెంట్స్ వైరల్..!!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రాకింగ్ రాకేష్ తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను గురించి తెలియజేయడం జరిగింది.. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఒకానొక సమయంలో తనని జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపొమ్మని చెప్పారట.. అయితే ఎవరో చెప్పిన మాటలు విని తనపై చాలా అపార్థం చేసుకొని తనని ఇలా గెంటేసారని తెలియజేశారు.. అయితే ఆ సమయంలో ఒకసారి ఆ విషయాన్ని చెక్ చేసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయానని తెలిపారు రాకింగ్ రాకేష్. అయితే ఆ తర్వాత నిజం తెలుసుకొని వారే తిరిగి మళ్లీ జబర్దస్త్ లోకి పిలిపించుకున్నారని తెలిపారు.
జబర్దస్త్ లో అవమానాలు బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ సమయంలో రోజా గారే తనకు అండగా నిలిచి అమ్మగా ఆప్యాయంగా పలకరించిందని ఆవిడలో ఉన్న మంచితనం గురించి తెలియజేస్తూ రోజా మేడం గారు తన దగ్గర ఒక గంట పాటు కూర్చొని ఏమి కాదు అంటూ ధైర్యం చెప్పి తనకంటూ ఒకరోజు వస్తుందని చెప్పి అండగా నిలిచిందని తెలిపారు.. సుజాత తాను కలవడానికి కూడా కారణం రోజా గారే అంటూ తెలిపారు.. మా వివాహానికైనా ప్రతి ఖర్చు కూడా తానే భరించిందని తిరుపతిలో చాలా వైభవంగా పెళ్లి జరిపించాలని తెలిపింది. ఇలా రోజా గారి గురించి చెబుతూ పొగడ్తలతో ముంచేశారు.. జబర్దస్త్ లో భజన చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని నీతి నిజాయితీగా ఉంటే ఎవరూ నమ్మరని తెలిపారు.