టీవీ: నటుడు నిరుపమ్ కు ఆ టిడిపి నేత బంధు అవుతారా..?

Divya
తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానల్ లో ప్రసారమైనటువంటి చంద్రముఖి అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు నటుడు నిరుపమ్ పరిటాల, మంజుల పరిటాల ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయ్యారు. అలా వీరిద్దరూ చంద్రముఖి సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే ప్రేమలో పడి ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా డాక్టర్ బాబుకి కార్తీకదీపం సీరియల్ ద్వారా మరింత క్రేజీ వచ్చింది. అప్పుడప్పుడు పలు రకాల యాడ్స్లలో కూడా కనిపిస్తూ మరింత సందడి చేస్తూ ఉంటారు.

నిరుపమ్ పరిటాల , రాయలసీమలోని పరిటాల రవి కుటుంబానికి పేరు కూడా పరిటాల ఉండడంతో చాలా మంది వీరికి బంధువులంటూ పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ విషయం పైన ఒక ఇంటర్వ్యూలో నిరుపమ్ మాట్లాడుతూ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా రిలీజ్ సమయంలో ఒక కానిస్టేబుల్ తనని ఆపాడని.. తాను డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వగా అందులో పరిటాల అని  ఉండడంతో వారి కుటుంబానికి చెందిన వ్యక్తి అని వెంటనే ఆ కానిస్టేబుల్ తనని పంపించాడని వాటితో పాటు టికెట్లు కూడా తానే తీసుకొచ్చి ఇచ్చాడంటూ తెలిపారు.

అంతేకాకుండా ఒకసారి కారు తీసుకున్న సమయంలో కూడా ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లగా తన ఇంటిపేరు పరిటాల కావడంతో తనకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి దగ్గరుండి మరి అక్కడున్న వారందరూ పనిచేయించారని తెలిపారు. ఎన్నోసార్లు జరిగాయని తెలిపారు. ఇండస్ట్రీలో కూడా వార్తలు వినిపించాయి ..వాస్తవానికి అసలు పరిటాల రవి కుటుంబానికి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కేవలం పరిటాల అనే పేరు మాత్రమే ఇద్దరికీ కలిసిందని తెలియజేశారు.. అయితే ఈ విషయం చాలామందికి తెలియక తామిద్దరం బంధువులంటూ పలు రకాల వార్తలు సృష్టించారని తెలిపారు. కానీ పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ గారి కలిసినప్పుడు కూడా ఆయన చాలా మర్యాద కరంగానే తనని మాట్లాడించారని తెలిపారు. నిరుపమ్ పరిటాల కంటే డాక్టర్ బాబు గానే మంచి పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: