టీవీ: అవకాశం కోసం వెళితే పడుకోమంటున్నారు.. బిగ్ బాస్ కిరణ్ రాథోడ్..!!
అయితే తిరిగి సినిమాలలో బిజీ కావాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రాథోడ్ తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.. తాను సినిమాలకు దూరం అవ్వడానికి ముఖ్య కారణం తన ప్రియుడు చెప్పడంతోనే సినిమాలకు దూరమయ్యానని అతను సినిమాలు వదిలేయాలని తనతో చెప్పడని అయితే తన మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను.. అప్పటికే తను ఫెడ్ అవుట్ గా మారిపోయానని కానీ మళ్ళీ సినిమాల్లోకి రావాలని ట్రై చేస్తున్నానని కిరణ్ రాథోడ్ వెల్లడించింది..
సినిమాలలో రావడానికి ట్రై చేస్తున్న సమయంలో తనని కొంతమంది తప్పుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆఫర్ కోసం వెళితే అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారంటూ వెల్లడించింది. ఇలాంటి కష్ట సమయంలో తన ప్రియుడు కూడా తనని వదిలేశారని ఒకసారి తన ప్రియుడు తనను కొట్టాడని అది తట్టుకోలేక ఒకరోజు అతనికి ఫోన్ చేసి రమ్మని పిలిచి కసి తీరా కొట్టి పంపించానని వెల్లడించింది కిరణ్ రాథోడ్. ఆ తర్వాత తనకు చాలామంది ఫోన్ చేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడే వారిని చాలా తప్పు ఉద్దేశంతో తనను వాడుకోవాలని చూస్తున్నారని వెల్లడించింది.. దీంతో ఒకవైపు అవకాశాలు రాక ప్రియుడు దూరమవ్వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది కిరణ్ రాథోడ్.