టీవీ: చమ్మక్ చంద్ర పైన స్వాతి నాయుడు చెప్పిన సంచలన నిజాలు..!!

Divya
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా చమ్మక్ చంద్ర అనే పేరు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఒకానొక సమయంలో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ పలు సినిమాలలో కమెడియన్ గా కూడా నటిస్తూ ఉన్నారు.. అయితే గతంలో చమ్మక్ చంద్ర గురించి శృంగార తారగా పేరు పొందిన స్వాతి నాయుడు తన పైన ఎన్నో ఆరోపణలు కూడా చేసింది.. ముఖ్యంగా చమ్మక్ చంద్ర తనని మోసం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే పోలీసులకు సైతం ఫిర్యాదు కూడా చేసింది స్వాతి నాయుడు.

గడిచిన కొన్నేళ్ల క్రితం చమ్మక్ చంద్ర గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ గా మారుతున్నాయి.. గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు మాట్లాడుతూ.. ఆమె తన కుటుంబంతో కలిసి జబర్దస్త్ కార్యక్రమానికి చూడడానికి వెళ్ళినప్పుడు చమ్మక్ చంద్ర స్వయంగా తనని తానే పరిచయం చేసుకున్నారంటూ వెల్లడించింది.. అలా తరచూ తనకి ఫోన్ కాల్స్ చేయడం కలుస్తూ ఉండే వారిని స్వాతి నాయుడు వెల్లడించింది. అలా తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి చమ్మక్ చంద్ర తనని చాలా దారుణంగా మోసం చేశారని తెలిపింది.

అయితే అప్పటికి ఇంకా జబర్దస్త్ కార్యక్రమంలో ఎక్కువగా ఫిమేల్ క్యారెక్టర్స్ కూడా మగవారు మాత్రమే చేసే వారిని.. దీంతో తన తమ్ముడికి మాత్రం అవకాశం ఇప్పించమని తాను అడిగానని స్వాతి నాయుడు తెలిపింది. ఈసాకుతో తనని చాలా దారుణంగా వాడుకున్నారని.. చమ్మక్ చంద్ర ఒక పెద్ద ఎదవ అని మొదట్లో తెలిసిపోయిందని స్వాతి నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే ఇదంతా డబ్బు కోసమే తన పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ తన మీద కూడా ఎన్నో ఆరోపణలు వినిపించాయి.. అయితే జబర్దస్త్ లో చాలామంది ఉన్నప్పటికీ కేవలం ఆయన మీద మాత్రమే ఎందుకు ఆరోపణలు చేస్తానంటూ గతంలో స్వాతి నాయుడు వెల్లడించారు.. అయితే చమ్మక్ చంద్ర అభిమానులు మాత్రం స్కిట్స్ వరకే ఆయన ఎక్కువగా అలా ఉంటారు తప్ప.. బయట మాత్రం చాలా మంచివారని చెబుతూ ఉంటారు.ఈ విషయాన్ని ఆయనతో పనిచేసిన జబర్దస్త్ కమెడియన్స్ కూడా చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: