టీవీ: ఆఫర్ చెప్పి..కమిట్మెంట్ అడిగారంటు ఎమోషనల్ కామెంట్స్ చేసిన నటి..!!
బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన మల్లికా తన రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తెలుగువారికి అవకాశాలు ఇవ్వారని బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాల నుంచి చాలా మందిని తీసుకొస్తున్నారని దీంతో తెలుగువారిని చిన్న చూపు చూస్తున్నారని.. అలా అవకాశాలు ఇవ్వక చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని నటి కామెంట్స్ చేసింది.. దీంతో సరిగ్గా తిండి తినకపోవడం వల్ల.. ఉన్న చోటునే పడిపోయేదాన్ని అంటూ తెలిపింది.. ఆ సమయంలో తన ఆరోగ్యం గురించి చూపించుకోవడానికి డబ్బులు కూడా లేవని బ్రతకడమే కష్టమని ఆ స్టేజ్ నుంచి మళ్లీ బ్రతికి బయటకు వచ్చానట్టు తెలిపింది మల్లిక.
19 సంవత్సరాల అనుభవం ఉన్న కరోనా తర్వాత తనకు ఆఫర్లు తగ్గిపోయాయని బతుకు తెరువు కోసం చీరలమ్మ.. పెట్రోల్ బంక్ లో కూడా పనిచేయడానికి సిద్ధమయ్యానని వెల్లడించింది.. పదేళ్ల క్రితం తన పారితోషకం రూ .1500 రూపాయలని నాలుగేళ్లు అదే రెమ్యూనరేషన్తోనే చేశానని తెలిపింది.. సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు డబ్బులు బాగానే సంపాదిస్తారు అనుకుంటారు.. కానీ అలాంటి పరిస్థితి అందరికీ ఉండదంటూ తెలిపింది మల్లిక. సినిమా ఆఫర్ ఉందని అడిషన్ కి రమ్మని చెప్పి కమిట్మెంట్ అడుగుతున్నారని తాను తన శరీరాన్ని అమ్ముకోలేనని మొహం మీద చెప్పేశారని తెలిపింది. ప్రస్తుతం మల్లిక చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఈ విషయాలను తెలియజేశారు.