టీవీ: సర్జరీ చేయించుకోని ట్రోల్ కి గురవుతున్న బిగ్ బాస్ బ్యూటి..!

Divya
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది సెలబ్రిటీలు సైతం అందంగా కనిపించడానికి తమ శరీరంలో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే కచ్చితంగా వాటికి సర్జరీ వంటివి చేయించుకొని సరిదిద్దుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఈ విషయం పై కామన్ గానే మారిపోయింది. చాలామంది ముఖానికి సర్జరీ వంటివి చేయించుకుంటూ ఉన్నారు. అయితే ఇలా సర్జరీ చేయించుకున్న తర్వాత కొంతమందికి మాత్రమే ఇవి సెట్ అవుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఇలా చేయించుకోవడం వల్ల ఉన్న అందం కూడా పోగొట్టుకొని చాలా ట్రోల్ కి గురయ్యే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది.

అలా ఇప్పుడు తాజాగా బుల్లితెర బ్యూటీ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ సత్య  అందరికీ సుపరిచితమే.. ముఖ్యంగా సోషల్ మీడియాతో వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బాగానే ప్రేక్షకులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాలు షోలు చేస్తూ బిజీగా తన లైఫ్ని గడిపేస్తూ ఉన్నది. అయితే ఇటీవలే శ్రీ సత్య ఒక సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా శ్రీ సత్య తన పెదవికి సర్జరీ చేయించుకున్నట్లుగా సమాచారం.. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను షేర్ చేయడం వల్ల గతంలో షేర్ చేసిన వీడియోలకు ఈ వీడియోస్ లను పోలిస్తూ తనకు అసలు సర్జరీని సెట్ కాలేదని అనవసరంగా శ్రీ సత్య లిప్ సర్జరీ చేయించుకుంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. అంతేకాకుండా ఉన్న అందాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు అంటు ఫైర్ ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.ఇప్పుడు చూడడానికి చాలా చండాలంగా ఉన్నావ్ అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి శ్రీ సత్య ఇలాంటి విషయాలను ఏ విధంగా ఎదుర్కొంటుంది ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: