టీవీ: స్టార్ అవ్వాలనుకుంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. నోయేల్ మాజీ భార్య..!
ఎస్తర్ మాట్లాడుతూ సమాజంలో ఇండస్ట్రీ కూడా ఒక భాగమే బయట సమాజంలో కూడా ఇలానే వేధింపులు ఉంటాయని ప్రతి రంగంలో కూడా మహిళల పైన ఇలాంటి అన్యాయాలు చాలానే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇవి మరింత ఎక్కువగా జరుగుతూ ఉంటాయని తెలిపింది. ఇలాంటి వాటిని మనం దూరం చేయలేము.. కానీ అమ్మాయిలు అందంగా ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో ఏదైనా సాధించాలి అని వస్తే కచ్చితంగా వారిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారని తెలిపింది. ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఎవరిని బలవంత పెట్టారు అది వారి యొక్క ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది అంటే తెలిపింది.
ముఖ్యంగా అవకాశాల కోసం నువ్వు ఏం చేయగలవుతావు అనే విషయాన్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటారని ఎస్తర్ తెలియజేసింది. మరి మీకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందా అంటూ యాంకర్ అడిగినప్పుడు.. ఎస్తర్ ఇలా మాట్లాడుతూ.. నేను అలా చేయలేను తన దారిలో తాను వెళుతున్నప్పుడు ఎవరు బలవంత పెట్టరు అలా కాకుండా ఎవరైనా వచ్చి రావడంతోనే స్టార్ అవ్వాలని ఉంది.. ఏం చెప్పినా చేస్తాను అనుకునే వారికి ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వవలసి ఉంటుంది.. ఇదే అలాంటి వారికి షార్ట్ కట్ అని కూడా తెలియజేసింది.. ఎవరైనా సరే టాలెంట్ తో హార్డ్ వర్క్ తోనే పైకి ఎదగాలంటూ తెలిపింది.. అయితే ఇండస్ట్రీలో అలాంటి విషయాల పైన ఎవరి ఇష్టం వాళ్ళది అంటూ తెలియజేసింది ఎస్తర్.