వేరేవాళ్లు అయితే చెప్పుతో కొట్టేదాన్ని.. జబర్దస్త్ రోహిణి ఫైర్..!
అదే విధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది రోహిణి. ఇదిలా ఉంటే ఈమె రేవ్ పార్టీలో దొరికిపోయినట్లుగా ఓ ఫన్నీ వీడియో చేసిన విషయం తెలిసింది. మొదట్లో అందరూ షాక్ అవ్వగా తరువాత అది ప్రమోషన్స్ లో భాగంగా చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అయితే ఓ జర్నలిస్టు మాత్రం ఆమె పై కాంట్రవర్సి కామెంట్స్ చేశారు. దీనితో తాజాగా దీనిపై స్పందిస్తూ..సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో రోహిణి మాట్లాడుతూ..నేను బర్త్ డే బాయ్ అనే దానికి ప్రమోషన్ చేశాను. అది వీడియో ప్రమోషన్ కోసం చేశానని మీడియా తెలుసుకుని దానిని ఫన్నీ వీడియో గా తీసుకున్నారు. కానీ, ఓ సీరియల్ జర్నలిస్ట్ మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడారు. ఓ వీడియోలో కూర్చుని నా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. రేవ్ పార్టీ అనగానే నిజంగానే దొరికే ఉంటుందని..నిప్పు లేకుండా పొగ రాదని అన్నారు.
ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకునే మాట్లాడాలి. ఏమీ తెలియకుండా ఇష్టమొచ్చినట్టు ఎలా మాట్లాడుతారు..? పైగా ఆయన సీరియల్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు. మరి అతను అలా ఎలా మాట్లాడుతారు. నేను మందు కూడా తాగను..అందులో చూపించేవి అన్నీ నిజం కాదు. అలాగే ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవటం వల్లే లావు అయ్యాను అని అందుకే పెళ్లి కాలేదు అందుకే అలా ఉండిపోయింది అని అన్నాడు. లావుగా ఉంటే పెళ్లి కాదా..సీరియల్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని అంటూ గట్టిగా ఇచ్చి పడేసింది జబర్దస్త్ రోహిణి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.