మిస్ గాసిప్ స్టార్ వసుధార.. గుప్పెడంత మనసు హీరో రిషి కామెంట్స్..!
డిసి క్యారెక్టర్ లేకుండా సీరియల్‌ను నడిపించడానికి కొత్త క్యారెక్టర్స్ ను ప్రవేశపెట్టి ఇన్నాళ్లు ఎలాగోలా లోక్కోచ్చారు మేకర్స్. రిషి, వసుంధరాల కెమిస్ట్రీ తోనే గుప్పెడంత మనసు సీరియల్ పాపులర్ అయింది. రిషి సీరియల్‌కు దూరం కావటంతో టిఆర్ పి రేటింగ్స్ పడిపోయాయి. రిషి రీ ఎంట్రీ తర్వాతే మళ్ళీ సీరియల్‌కు ఫాలోయింగ్ పెరిగింది. రిషి, వసుంధరాల ప్రేమ కథను ప్రజెంట్ కొత్త యాంగిల్స్ మేకర్స్ నడిపిస్తున్నారు. తాజాగా ఆదివారం స్టార్ మా పరివారం షోలో రిషి, వసుంధర సందడి చేయబోతున్నారు. మామగారు వర్సెస్ గుప్పెడంత మనసు పేరుతో ఈ వారం స్టార్ మా పరివారం షో డెలికాస్ట్ కాబోతుంది. ఈ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
ఈ షోలో గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి, ముఖేష్ గౌడ్, వసుంధర, రక్ష గౌడ, మహేంద్ర, సాయి కిరణ్, శైలేంద్ర, సరోజ పాత్రధారులు అడేండ్ అయ్యారు. మామగారు సీరియల్ నుంచి సుహాసిని తో పాటు మిగిలిన లీడ్ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ కనిపించబోతున్నారు.ఈ షో ప్రోమోలో వసుంధర పై రిషి ఫన్నీ కామెంట్స్ చేశాడు. మిస్ గాసిఫ్ ఫరెవర్ గా వసుంధర అవార్డు ఇచ్చాడు రిషి. సీరియల్ సెట్స్ లో రకరకాల గాసిప్స్ క్రియేట్ చేస్తున్నాడని అన్నాడు. వినత సెట్స్ లో అడుగుపెట్టిన తొలి రోజే ఆమెకు నా గురించి అన్ని విషయాల్ని రక్షా చెప్పేసిందని రిషి అన్నాడు.