టీవీ: బిగ్ బాస్ -8 లో క్రేజీ బ్యూటీ..మామూలుగా ఉండదంటున్న ఫాన్స్..!
బిగ్ బాస్ -8 లో ఉత్కంఠత అభిమానులను పెంచుతోంది ఎందుకంటే ఈసారి హౌస్ లో ఎవరెవరిని తీసుకువస్తారు అనే విషయం చర్చనీ అంశంగా మారింది. సోషల్ మీడియాలో హౌస్ లోకి వెళ్ళేది వేరే అంటూ కొన్ని పేర్లు కూడా వైరల్ గా మారదు ఉన్నాయి.. ఈసారి కూడా హౌస్ లోకి చాలా మంది తెలిసిన వారి వెళ్ళబోతున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బర్రెలక్క, అలాగే కుమారి ఆంటీ, నటి హేమ, సురేఖ వాణి, బుల్లెట్ భాస్కర్, రీతు చౌదరి, అమృత, వేణు స్వామి తదితర పేర్లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా నటి సోనియాసింగ్ పేరు కూడా వినిపిస్తోంది.. తన ప్రియుడు సిద్దుతో కలిసి ఈమె పలు రకాల షార్ట్ ఫిలిం లలో కూడా నటించింది. అలాగే సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించింది. అలా ఈ సినిమా ద్వారా కూడా క్రేజీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ -8 లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించడంతో అభిమానులు ఇక హౌస్లో ఫుల్ గ్లామర్ ట్రీట్ తో పాటు సందడే సందడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇటీవల పలు రకాల ఓటీటీ వెబ్ సిరీస్ లలో నటించింది. మరి పూర్తిగా హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రి ఇస్తారనే విషయం తెలియాల్సి ఉన్నది.