టీవీ: బిగ్ బాస్ -8 లోకి చిరంజీవి ఫ్రెండా.. ఎవరంటే..?

Divya
తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని అలరించేందుకు  బిగ్ బాస్ మళ్లీ సిద్ధమవుతోంది. గత సీజన్ కు మించి ఈసారి సడన్ సర్ప్రైజ్లు ఎక్కువగానే ఉండబోతున్నట్లు వార్తలు ఇస్తున్నాయి. ఈసారి ఊహించని కన్సిస్టెంట్లు హౌస్ లోకి రాబోతున్నట్లు సమాచారం. మొత్తానికి గత ఏడు సీజన్ల కంటే ఎనిమిదవ సీజన్ భిన్నంగా ఉంటుందని అంతకుమించి అనేలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందనే విధంగా బిగ్ బాస్ నిర్వహణ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రోమో కూడా విడుదలయ్యింది. 8వ సీజన్ కి పేరుతోపాటు టిఆర్పి రేటింగ్ లో కూడా పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.

ఆగస్టు చివరి వారం లేకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8వ సీజన్ ని త్వరలోనే వీటిపైన అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.. అలాగే సీజన్ కోసం కంటెస్టెంట్ లో ఎంపిక కూడా చాలా శరవేగంగా జరుగుతున్నది. ప్రస్తుతం యాంకర్స్, సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన వారు, యూట్యూబ్ యాంకర్స్ తో పాటు వివాదాలకు సంబంధించిన వ్యక్తులను కూడా హౌస్ లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.. ముఖ్యంగా హీరో అబ్బాస్, రాజ్ తరుణ్, విష్ణు ప్రియ, రీతు చౌదరి, కుమారి ఆంటీ, బుల్లెట్ భాస్కర్ తదితర సెలబ్రిటీలను కూడా తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ నటుడుగా పేరుపొందున హీరో రోహిత్ కూడా ఎన్నో చిత్రాలను నటించారు.. ముఖ్యంగా జానకి వెడ్స్ శ్రీరామ్, కీలుగుఱ్ఱం, నవవసంతం తదితర చిత్రాల హీరోగా నటించారు. అలాగే చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్, జిందాబాద్ సినిమాలలో చిరంజీవి స్నేహితుడి పాత్రలో నటించారు.. 2010 తర్వాత సినిమాలకు దూరమైన రోహిత్ 14 ఏళ్ల తర్వాత రామ్ అనే చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మెగా అభిమానులు సపోర్ట్ చేస్తారని కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి రోహిత్ వస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: