టీవీ: బిగ్ బాస్ -8 లోకి స్టార్ కమెడియన్ తమ్ముడు.. ఎవరంటే..?
ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన ఆలీ తమ్ముడు ఖయ్యుమ్ ను బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆలీ తమ్ముడు కూడా ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే వీరితో పాటు మరొక పాపులర్ నటినీ బిగ్ బాస్ 8 లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఆమె ఎవరో కాదు స్వాతి నాయుడు.. టీవీ షోలకు గతంలో యాంకర్ గా చేసిన ఈమె ఎక్కువగా పోర్న్ చిత్రాలకు సంబంధించి విషయాలను కూడా ఓపెన్ గానే మాట్లాడుతూ సంచలనంగా మారుతూ ఉంటుంది.
మరి ఇప్పటివరకు బుల్లితెర వర్గాల నుంచి ఈ పేర్లు సైతం వినిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరితో పాటు ప్రముఖ యాంకర్లుగా పేరుపొందిన రీతూ చౌదరి, విష్ణుప్రియ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఒక హింట్ కూడా ఇచ్చినట్లు ఇటీవలే ఒక షోలో తెలియజేశారు. మరి వీటికి సంబంధించి ఇంకా అధికారికంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి ఎవరెవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎంత రసవత్తంగా ఆటలు జరుగుతాయి చూడాలి మరి.