టీవీ: బిగ్ బాస్-8 కి హోస్ట్ గా స్టార్ హీరోనా..?

Divya
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో ప్రస్తుతం 8వ సీజన్ మొదలు కాబోతోంది. చాలా భాషలలో సైతం చాలా సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులో ప్రస్తుతం అయితే బిగ్ బాస్ షో కి హోస్టుగా నాగార్జున వ్యవహరిస్తూ ఉన్నారు.. అయితే తమిళంలో కుడా ఇప్పటివరకు  ఏడు సీజన్లను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎనిమిదవ సీజన్ కు సిద్ధమవుతున్న తరుణంలో హోస్టుగా ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది. గతంలో కమలహాసన్ ఉన్నప్పటికీ అటు రేటింగ్ పరంగా బాగానే తీసుకువచ్చారు. ఇటీవలే తాను విరామం తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా ఎవరు చేసినా కూడా అందరూ సపోర్ట్ చేయాలి అంటు తెలియజేశారు కమలహాసన్.

దీంతో ఇప్పుడు కమలహాసన్ ప్లేస్ లో ఎవరు వస్తారా అనే విషయం పైన అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు తమిళ ప్రేక్షకులు. అయితే ఎంతో మంది హీరోల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఒక స్టార్ హీరో బిగ్ బాస్ తమిళ సీజన్ 8 కి హోస్టుగా రాబోతున్నారట. ఆయన ఎవరో కాదు విభిన్నమైన పాత్రలకు  పెట్టింది పేరు హీరో విజయ్ సేతుపతి.. బిగ్ బాస్ హోస్టుగా చేయబోతున్నారనే  విషయం అభిమానులకు తెలిసినప్పటి నుంచి ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తున్నారు.. ఇప్పటివరకు హీరోగా విలన్ గా చేసిన విజయ్ సేతుపతి మరి ఇలాంటి వాటినీ ఒప్పుకుంటారా లేదా అనే సందేహం కూడా అభిమానులు కలుగుతోంది.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ న్యూస్ తమిళ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి తమిళ ప్రేక్షకుల అభిప్రాయం మేరకు విజయ్ సేతుపతిని బిగ్ బాస్ 8వ సీజన్ కు హోస్టుగా వ్యవహరిస్తే.. కచ్చితంగా టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: