టీవీ:KBC షోకి అమితాబచ్చన్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..!
KBC -16 కోసం ఒక్కో ఎపిసోడ్ కు ఎంత తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే వెడబడలేదు కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం KBC -16 కోసం ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కోసం ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కౌన్ బనేగా కరోడ్ పతి ఓకే మొదట రూ.25 లక్షల రూపాయలు ఒక ఎపిసోడ్కి తీసుకునేవారట.. ఇప్పుడు 16వ షోకి ఏకంగా రూ .5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
KBC -16 ఈ వారం సోనీ టీవీలో ప్రసారం కాబోతోంది. మొదటి ఎపిసోడ్ సమయంలో బిబి ఉద్వేగానికి లోనవ్వడమే కాకుండా..KBC లో తన ప్రయాణాన్ని కూడా తెలియజేశారు. అలాగే అతనికి మద్దతు ఇచ్చిన అభిమానులందరికీ కూడా ఒక సందేశం తెలియజేశారు అమితాబ్ బచ్చన్. తనతో ఇన్నేళ్లపాటు నడిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎలాంటి పదాలు సరిపోవడంలేదని .కౌన్ బనేగా కరోడ్ పతి తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిందని అదంతా కూడా మీ ప్రార్ధనల వల్లే జరిగింది అంటూ ధన్యవాదాలు తెలియజేశారు. మళ్లీ మీ మధ్య కనిపించేందుకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతనీ అంటూ తెలిపారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ రెమ్యూనరేషన్ వైరల్ గా మారుతున్నది.