టీవీ: బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ నటుడు.. రచ్చెనా..?

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపిస్తున్న పేరు ఏమిటంటే.. బిగ్ బాస్ -8 ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ నెల నుంచి బిగ్బాస్ సీజన్ మొదలు కాబోతోంది. దాదాపుగా 104 రోజులపాటు ఈ షోలో కనిపిస్టెంట్లు ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. బిగ్ బాస్-8 వ సీజన్ కి సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు కూడా షో నిర్వాహకులు విడుదల చేయడం జరిగింది.. గడిచిన బిగ్ బాస్-7 కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసారి 8 కి అంతకుమించి ప్లాన్ చేసేలా చేస్తున్నారు.

ఇందులో భాగంగానే కనిపిస్తుంది కూడా సెలెక్ట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి హౌస్ లో సర్ప్రైజ్లు కూడా చాలానే ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హౌస్ లోని కంట్రీస్టన్ల దగ్గర నుంచి టాస్కుల వరకు అన్నీ కూడా పక్క ప్లాన్ ప్రకారం అమలు చేసే విధంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హౌస్ లోకి నేమ్ ఫ్రేమ్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీరియల్ కేటగిరి నుంచి సోషల్ మీడియా అలాగే బుల్లితెర కమెడియన్స్ ఇలా పాపులారిటీ వారిని తీసుకుంటున్నారట. అయితే తాజగా ఇప్పుడు వెండితెర నటుడుగా కమెడియన్ గా పేరు పొందిన అభినవ గోమఠం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ యాజమాన్యం అభినవును సంప్రదించినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో యంగ్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన ఈ నటుడు.. ముఖ్యంగా తను చెప్పే డైలాగులకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అప్పుడప్పుడు కూడా సెటైరికల్ డైలాగులు వేస్తూ ఉంటారు అభినవ్ గోమఠం. ఈ మధ్యనే హీరోగా కూడా పలు చిత్రాలలో నటించారు.. మరి అలాంటి ఈ నటుడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారా అంటే అభిమానులు మాత్రం కాస్త అనుమానమే అన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఒకవేళ వచ్చిన ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకొని వస్తే హౌస్ లో చూడవచ్చు అంటే పలువురు నెట్టిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: