టీవీ: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ కు ప్రెగ్నెన్సీ వస్తే.?

Divya
బిగ్బాస్ హౌస్ లోకి లేడీ కంటెస్టెంట్స్  కూడా వస్తూ ఉంటారు.. అయితే ఇప్పటివరకు 7 సీజన్లు తెలుగులో జరిగిన లేడీ కంటెస్టెంట్స్ మీద ఎలాంటి  మచ్చ రాలేదు కానీ హిందీలో జరిగిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక జంట హౌస్ లో పని కానివ్వడం వల్ల చాలామంది దారుణంగా కామెంట్స్ చేశారు.. దీంతో ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ హౌస్ మీద చాలామందికి ఎదురైన ప్రశ్న ఏమిటంటే హౌస్లో లేడీ కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయితే పరిస్థితి ఏంటి అని అంతగా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి ఇతర బిగ్ బాస్ హౌస్లలో ఎప్పుడైనా ఎదురైందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

హౌస్ లో ఎప్పుడూ కూడా వింతలు విశేషాలు వంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా తారలు ఎలా ఉంటారో వారి యొక్క నిజస్వరూపం ఏంటే అన్నది హౌస్ లో చాలా క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు ఉండడమంటే అది ఆశామాసి విషయం కాదు.. ఎలాంటి సెలబ్రిటీ అయినా కూడా వారి పర్సనల్ జీవితంలో కొన్ని ముఖ్యమైన రోజులను ఇక్కడ వచ్చిన తర్వాత వదిలేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది మెయిల్ స్టార్స్ కంటిస్టెంట్లుగా వచ్చి తమ భార్య డెలివరీ అయిన పిల్లలను కూడా చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇక లేడి కంటెస్టెంట్స్ అయితే పిల్లలు పుట్టి నెలలు గడవకముందే హౌస్ లోకి వచ్చిన వారు కూడా ఉన్నారట.

హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎవరైనా లేడీ కంటెస్టెంట్  ప్రెగ్నెంట్ వస్తే పరిస్థితి ఏంటా అని సంఘటన ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీ లోనే జరగలేదట. ఒకవేళ ఇలాంటి సంఘటన ఎదురవుతే.. హౌస్ యాజమాన్యం ఏం చేస్తారని ప్రశ్న మిగిలిపోయింది.. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఉండదట.. ఎందుకంటే బయట నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు వీరికి ఎన్నో రకాల పరీక్షలు చేసి మరి లోపలికి తీసుకువస్తారు.అయితే కొంతమంది వివాహమైన వారు లేకపోతే రిలేషన్ లో ఉన్నవారు హౌస్ లోకి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మాత్రం అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.

అయితే ఇలాంటి ఒక సంఘటన హిందీ బిగ్ బాస్ లో ఎదురయ్యింది..  సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ ప్రేయసి అంకితా హౌస్ లోకి తన భర్త విక్కీ తో వచ్చిన తర్వాత ఆమె ఒకానొక సందర్భంలో ప్రెగ్నెంట్ అయ్యాననే అనుమానం వచ్చిందని తన భర్తతో చెప్పగా హౌస్ యాజమాన్యం టెస్టు చేసిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చు అని సూచించారు. కానీ టెస్ట్ మాత్రం నెగిటివ్ రావడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: