టీవీ: బిగ్ బాస్ -8 కంటిస్టెంట్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Divya
బుల్లితెర ప్రేక్షకులకు సైతం వినోదాన్ని అందించేటువంటి బిగ్బాస్ షో కూడా ఒకటి. సుమారుగా 100 రోజులపాటు ఈ షో జరుగుతూ ఉంటుంది. తాజాగా బిగ్ బాస్-8 వ సీజన్ తెలుగులో నిన్నటి రోజున చాలా గ్రాండ్ గానే లాంచ్ అయింది. దీంతో మొత్తం 14 మంది కంటిస్టేన్స్ ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇందులో కొంతమంది యాంకర్లు యూట్యూబర్స్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా చాలామంది ఉన్నారు. చాలామంది సెలబ్రిటీలు కూడా తమ అదృష్టాన్ని హౌస్ లో పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. సాధారణంగా ఏ సీజన్లో అయినా సరే ప్రతి కంటెంట్ కి వారానికి చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండడం జరుగుతోంది. ప్రతి వారం కూడా హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి చాలాసార్లు ఇలాగే చెల్లించారు. కానీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి పెద్దగా ఎవరు పాపులర్ కంట్రీస్ టెన్స్ హౌస్ లోకి రాలేదని అభిప్రాయం ప్రేక్షకులలో కనిపిస్తోంది. యాంకర్ గా పేరు పొందిన విష్ణు ప్రియకి కాస్త పాపులారిటీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

ఇక రెమ్యూనరేషన్ కూడా కాస్త ఈమెకే ఎక్కువగా ఇచ్చేలా చూస్తున్నారట. సుమారుగా వారానికి 4 లక్షల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత రెమ్యూనరేషన్ హీరో ఆదిత్య హోమ్ కి ఇవ్వబోతున్నట్లు 3 లక్షల రూపాయలు తెలుస్తోంది.  సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పృధ్విరాజ్, బెజవాడ బేబక్క, సోనియా ఆకులకు రూ.1.50 లక్షల రూపాయలు ఇస్తున్నారట. అయితే ఇదంతా కూడా కేవలం అంచనా అన్నట్లుగా తెలుస్తోంది.
1). విష్ణు ప్రియా కి-4 లక్షలు
2). ఆదిత్య ఓం-3 లక్షలు
3). యస్మిగౌడ -2.50 లక్షలు
4). ఆర్ జె శేఖర్ భాష-2.50 లక్షలు
5). నిఖిల్ మలియక్కల్ -2.25 లక్షలు
6). నైనిక-2.20 లక్షలు
7). అభయ్ నవీన్-2 లక్షలు.
8). ప్రేరణ-2 లక్షలు
9). నబిల్ ఆఫ్రిద్ -2 లక్షలు.
10).. కిరాక్ సీత-2 లక్షలు
11). సోనియా-1.50 లక్షలు
12). బెజవాడ బేబక్క-1.50 లక్షలు
13). పృధ్విరాజ్-1.5 లక్షలు
14). నాగ మణికంఠ -1.20 లక్షలు అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: