టీవీ: బిగ్ బాస్ వల్ల.. సోనియాకు వచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Divya
బిగ్ బాస్-8షోలో ఊహించినట్టుగానే సోనియా ఆకుల నాలుగవ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ లో తరచూ ఎక్కువగా వాదాలు, గొడవలు చేస్తూ ఉండటం వల్ల ఈమె పేరు బాగా వైరల్ గా మారింది. వీటికి తోడు చిన్నోడు పెద్దోడు అంటూ కూడా పృద్వి, నిఖిల్  కంటెస్టెంట్లతో హగ్గుల ప్రవర్తన ఈమె తీరు పైన ఆడియన్స్ కి విసుగు తెప్పించేలా చేశాయి. అందుకే నాలుగో వారంలో చాలా తక్కువ ఓటింగ్ కారణంగా బయటికి వచ్చేసింది సోనియా. సోనియా 4వారాలకు హౌస్ లో ఉండడం వల్ల రెమ్యూనరేషన్ ఎంత అందిందనే సమాచారం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.

హౌస్ లోకి రాకముందే పారితోషానికి సంబంధించి కాంట్రాక్ట్ కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
 హౌస్ లో అడుగు పెట్టడానికి ఈమె రోజుకి రూ .28000 చొప్పున ఒప్పందం చేసుకున్నదట. దీన్నిబట్టి చూస్తే ఒక వారానికి రూ .2 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునే ఉంటుంది సోనియా. అలా నాలుగు వారాలకి మొత్తం మీద రూ.8 లక్షల రూపాయలకు చెక్కు అందుకున్నట్లు సమాచారం. సోనియా మొదట మోడల్ గా తనకి కెరీర్ని ప్రారంభించి 2019లో జార్జి రెడ్డి అనే ఒక చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ అనే చిత్రంలో కూడా లీడ్ రోల్ నటించింది. ఆ తర్వాత ఎన్కౌంటర్ అనే చిత్రంలో నటించిన సోనియా.. మరే సినిమాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ -8 కు ఆఫర్ రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈమె నాలుగో వారం ఎలిమినేట్ కావడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గానే ఉంటూ బాగానే క్రేజ్ అందుకుంది. అయితే వైల్డ్ కార్డు ద్వారా తిరిగి కంటెస్టెంట్లను తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో ఈమె పేరు ఉంటుందో లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: