యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు.ప్రస్తుతం దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తూ, వార్ 2తో షూటింగ్ లో బిజీ గా వున్నారు ఎన్టీఆర్. ఇదిలావుండగా ఎన్టీఆర్ హెస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కాదా.తెలుగులో బిగ్ బాస్ ను స్టార్ట్ చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫస్ట్ సీజన్ అయినా చాలా అనుభవం ఉన్నట్టుగా నడిపించాడు తారక్. గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు హెస్టింగ్ చేసిన అనుభవంతో బిగ్ బాస్ ను అద్భుతంగా హోస్టింగ్ చేశాడు తారక్. కాని ఆతరువా సిజన్లు ఎన్టీఆర్ హోస్ట్ అయ్యింటే అదిరిపోయేవి. కాని ఆయన సినిమాల్లో బిజీగా ఉండి వదులుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు గత 8 ఏళ్ళుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఒకటీ రెండు సీజన్లు తప్పించి అన్ని సీజన్లను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఇక తెలుగు బిగ్ బాస్ కు 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున్ హోస్ట్ గా కొనసాగుతున్నారు.కాగా రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని.. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా కొనసాగారు.ఇదిలావుండగా ఒక సమయంలో బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌తో సరదాగా మాట్లాడిన తారక్ వారు చేసిన వంట సైతం రుచి చూశాడు.
ఈ క్రమంలోనే తన బ్యాంక్ అకౌంట్లో ఎంత మనీ ఉందో సరదాగా చెప్పాడు ఎన్టీఆర్. ఆళ్లేదో తినమంటున్నారు. "బ్యాంక్‌లో నా బ్యాలెన్స్ రెండు రూపాయల 30 పైసలు ఉంది. అది మా ఆవిడకు ఇవ్వండి" అని చిరంజీవి ‘చంటబ్బాయ్’ మూవీలోని డైలాగ్‌ను చెప్పాడు. ఫుడ్ తిన్న తర్వాత కూడా అదే సినిమాలోని సీన్‌ను రీ క్రియేట్ చేస్తూ డైలాగ్స్ చెప్పాడు ఎన్టీఆర్.ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 నడుస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 1 సీజన్‌కు హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్ కామెడీ టైమింగ్‌ను పొగుడుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు నెటిజన్స్. "తారక్ కామెడీని ఉపయోగించుకుని ఒక రోమ్-కామ్ తీయండయ్యా ఎవరైనా" అని సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. అలా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతనేది ఫన్నీగా చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.