టీవీ: ఈ జబర్దస్త్ యాంకర్ కష్టాలు తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు..!
అయితే ఈమె యాంకర్ గా జబర్దస్త్లు ఎక్కువ రోజులు కొనసాగలేదు.. ఆ తరువాత సిరిహనుమంతు యాంకర్ గా చేస్తున్నది.. మొదట సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన సౌమ్య రావు తన కెరీర్ లో ఎన్నో కష్టాలను సైతం చవి చూసింది సౌమ్యరావు. అంత ఈజీగా యాంకర్ స్థాయికి రాలేదట. ఈ విషయాలను ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన జీవితంలో ఎదురైన కొన్ని కష్టాలను కూడా తెలియజేసింది సౌమ్యరావు.. తనకు తెలుగు రాకపోయినా తెలుగు సినీ ప్రేక్షకులు తనని చాలా ఆదరిస్తున్నారు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.
అలాగే తన తల్లి గురించి మాట్లాడుతూ మా అమ్మే గురువు, ఆమె సంగీతం నేర్పించింది మా కుటుంబం చాలా కష్టాలను చవి చూసింది.. ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తినడానికి తిండి లేక ఎవరైనా భోజనం పెడతారేమో అని ఎదురు చూశాము.. ఆ సమయంలో తన తల్లికి బ్రెయిన్ క్యాన్సర్ కూడా వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆకలితో అలమటించే వాళ్ళమంటూ తెలిపింది సౌమ్యరావు.. అందరూ తిన్న తర్వాత ఏదైనా మిగిలిందని ఎవరైనా తెచ్చి ఇస్తారా అని ఎదురుచూసే వాళ్ళమని తెలిపింది. ఈ కష్టాలే మా జీవితాలను కూడా మార్చేశాయని ఈ కష్టాలు తనని చాలా మానసికంగా బలంగా మార్చేలా చేశాయని తెలిపింది సౌమ్యరావు.