టీవీ: బిగ్ బాస్ 8లో ఊహించిన ట్విస్ట్.. ఆఖరి నిమిషంలో ఎలిమినేట్ ఎవరంటే..?

Divya
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం చాలా ఉత్కంఠంగా కొనసాగుతూ ఉన్నది. ఈ ఎనిమిదవ సీజన్ ప్రస్తుతం 15 వ వారం అయితే కొనసాగుతూ ఉండగా ఈ వారంలో హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం పైన అభిమానులు వారి అంచనాలు వారు వేస్తున్నారు.అయితే ఇలాంటి సమయంలోనే జబర్దస్త్ నటుడు కమెడియన్ అయినా ముక్కు అవినాష్ 105వ రోజున బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అవినాష్ నాలుగో రన్నర్ గా నిలిచారు.

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ముక్కు అవినాష్ దీంతో ఈ సీజన్లో 35వ రోజు నుంచి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి 105 రోజుల వరకు హౌస్ లో తన ఆట తీరుతో బాగా ఆకట్టుకున్నారు.. బిగ్ బాస్ తెలుగు సీజన్ సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్గా ప్రారంభమైంది.మొదట 14 మంది కంటెస్టెంట్ ఇందులో పాల్గొన్నప్పటికీ ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా 8 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇందులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమకు సాధ్యమైనంతవరకు ఎంటర్టైన్మెంట్ ని పంచడం జరిగింది

దాదాపుగా 105 రోజులు సాగిన ఈ బిగ్ బాస్ 8 ప్రయాణం రేపటితో పూర్తి కాబోతోంది. డిసెంబర్ 15న అట్టహాసంగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేని నిర్వహించబోతున్నట్లు సమాచారం. మొత్తం 22 మంది కంటిస్టెంట్లను సైతం పాల్గొన్నప్పటికీ ప్రతి వారము కూడా ఎలిమినేషన్ , డబుల్ ఎలిమినేషన్ తో చివరి ఐదుగురు మాత్రమే గ్రాండ్ ఫినాలే లోకి అవకాశం దక్కించుకున్నారు. అయితే టైటిల్ రేసులో మాత్రం అవినాష్, నబిల్ వంటి వారు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం నిఖిల్, గౌతమ్ ప్రేరణ వంటి వారు మాత్రమే ఉన్నారు. ఇందులో ఎవరో ఒకరు బిగ్ బాస్ 8 విన్నర్ గా నిలవబోతున్నారనే విషయం అభిమానులను మరింత ఉత్కంఠతను పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: