టీవీ: లైవ్ షోలోనే ముఖాలు తిప్పేసుకున్న బిగ్ బాస్ జంట... బ్రేకప్ అయినట్టేనా..?
అయితే బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత కావ్యాన్ని కలుస్తానంటూ నిఖిల్ చెప్పాడు కానీ అలా చేయలేదు. నేరుగా తన సొంత ఊరికి వెళ్ళిపోయారు అయితే ఇటీవలే ఒక షోలో ఈ మాజీ ప్రేమికులు నిఖిల్, కావ్య ఎదురైనప్పటికీ ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ షోలో నిఖిల్ ఉన్నంత సేపు కూడా ఎక్కువగా సీరియస్ ఫేస్ తో కనిపించారు కావ్య. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సంబంధించి ఇటీవలే ఒక ప్రోమో కూడా విడుదలయ్యింది.
ఇందులో బిగ్ బాస్ విజేతగా నిలిచిన నిఖిల్ తో పాటుగా కావ్యను తీసుకురావడం జరిగింది. ఇందులో హోస్ట్ గా చేస్తున్న శ్రీముఖి వీళ్ళని పరిచయం చేస్తాను పదా అంటూ కావ్య ఆడుతున్న టీమ్ దగ్గరికి తీసుకు వెళ్లడం జరిగింది.. కానీ కావ్య మాత్రం నిఖిల్ వైఫ్ చూడడానికి కూడా ఇష్టపడడం లేదు.. చాలా సీరియస్ ఫేస్ ని ఈ ప్రోమోలో మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ నిఖిల్ మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు. చివరికి శ్రీముఖి నిఖిల్ ని కళ్లద్దాలు తీయొచ్చు కదా అంటే ఈ షో అయిపోయే వరకు తీయను అంటు తెలియజేస్తారు.. మరి ఈ ప్రోమో చూసిన వారందరూ కూడా కావ్య, నిఖిల్ ఇద్దరు నిజంగానే ఇక విడిపోయారేమో అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.