టీవీ: పెళ్లిపై ట్రోల్ అవుతున్న బిగ్ బాస్ సోనియా.. మరి ఇంతలానా..?

Divya
మొదట పలు చిత్రాలను హీరోయిన్గా నటించిన సోనియా ఆకుల అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఇటీవల బిగ్ బాస్ -8 వ సీజన్లో లేడీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి భారీ పాపారాటీ సంపాదించుకుంది అయితే అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయినా భారీ క్రేజ్ అందుకుంది. అయితే తాను ఎలిమినేట్ అవ్వగానే కచ్చితంగా తను ప్రేమించిన యష్ ని వివాహం చేసుకుంటానంటూ తెలియజేసింది. అయితే అలా వివాహం చేసుకున్న సాయంత్రానికి సోనియా ఇస్మార్ట్ జోడి 3లో కనిపించింది.

హైదరాబాద్ వేదికగా సోనియా , యష్ వివాహానికి చాలామంది బుల్లితెర నటీనటులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సైతం వీరి వివాహానికి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించడం జరిగింది. అయితే ఇలా వివాహమైందో లేదో తాజాగా సోషల్ మీడియాలో సోనియా గురించి యష్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేమిటంటే సోనియా కోసమే మొదటి భార్యకు యష్ విడాకులు ఇచ్చారని రూమర్స్ వినిపిస్తూ ఉండడంతో ఈ విషయం మీద ఈ జంట స్పందించింది.

ప్రస్తుతమైతే తాను విడాకులు తీసుకున్న విషయం గురించి ఏమీ మాట్లాడనని కానీ వచ్చిన రూమర్ నిజం కాదంటూ తెలిపారు యష్ . అయితే కొన్ని పర్సనల్ కారణాల వల్ల తాము విడిపోవాలనుకున్నామని ఆ తర్వాతే సోనియా తన జీవితంలోకి వచ్చింది అంటూ తెలియజేశారు. అలాగే తన బిడ్డ విరాట్ ని కూడా తన ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటుందని నమ్మకం కలిగిందని.. అలా కుటుంబమంతా కూడా సోనియాకు రెస్పెక్ట్ ఎక్కువగా ఇచ్చేవారిని.. అంతేకాకుండా తన కుటుంబం గురించి తన గురించి కూడా బాగా తెలుసని తనతో ఎలా ట్రీట్ చేయాలో కూడా బాగా తెలుసు అని తెలిపారు యష్. రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన వైరస్ సినిమాలో సోనియా ఆకుల నటించిన ఆ తర్వాత ఆశ, ఎన్కౌంటర్ వంటి చిత్రాలలో కూడా నటించింది. అయితే సోనియా అభిమానుల సైతం తనపై వచ్చిన రూమర్ ని  కొట్టి పారేస్తూ మరి ఇంతలా దిగజారిపోయి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అంటూ కౌంటర్స్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: