టీవీ: బాలయ్య షోకి చిరంజీవి రాకపోవడానికి కారణం..?
అయితే చిరంజీవి అన్ స్టాపబుల్ షో కి రాకపోవడానికి గల కారణం ఏంటా అని వెతకగా ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.. అయితే ఇప్పటివరకు అన్ స్టాపబుల్ షో నుంచి చిరంజీవికి రమ్మని ఎలాంటి ఆహ్వానం అందించలేదని టాక్ వినిపిస్తోంది. ఇందువల్లే చిరంజీవి ఈ షోకి వెళ్లలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ షో కి బాలయ్య వల్లే భారీ క్రేజ్ ఏర్పడింది. ఆహా కి కూడా మరింత రేటింగ్ కూడా పెరిగిందని చెప్పవచ్చు.
అయితే ఇప్పటికే మెగాస్టార్ కుమారుడైన రామ్ చరణ్ వంటి వారు ఈ షోకి రావడం వల్ల మరింత క్రేజ్ పెరిగిందని.. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించడానికి ఆహా టీం సిద్ధం అయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో కూడా చిరంజీవిని కలిసి ఆహ్వానించాలని టీం అనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత చిరంజీవిని ఆహ్వానించలేకపోయారట. కానీ ఈసారి మాత్రం అల్లు అరవింద్ చిరంజీవిని ఆహ్వానించడానికి ప్రత్యేకంగా వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఒకే వేదిక పైన అటు బాలయ్య, చిరంజీవి వంటి ఇద్దరు సూపర్ స్టార్ లను చూడడమంటే అది అభిమానులకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి ఇది ఎప్పుడు జరుగుతుందో చూడాలి మరి.