టివి: నా జీవితంలో ఆరోజు దుఃఖమైన రోజు..యాంకర్ ఎమోషనల్ కామెంట్స్..!
తెలుగు బుల్లితెరపై నటిగా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో సమీరా కూడా ఒకరు. ఇమే ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా బాగానే పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత ముద్దుబిడ్డ, మూడుముళ్ల బంధం, అభిషేకం తదితర సీరియల్స్ లో కూడా నటించి భారీ క్రేజ్ అందుకుంది. అలాగే అదిరింది వంటి టీవీ ప్రోగ్రామ్స్లకు కూడా యాంకర్ గా చేసి మరింత క్రేజ్ అందుకున్నది సమీరా అయితే గత కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉన్నది సమీరా.
2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సమీర 2021లో తన ప్రెగ్నెంట్ అయ్యిందట.అయితే తనకు అర్హన్ అనే బాబు పుట్టాడని వెల్లడించింది.. మళ్లీ 2023లో తాను గర్భం దాల్చానని తెలిపింది. ఆ సమయంలో తన చాలా ఆనందపడ్డానని కానీ ఆ ఆనందం తనకి ఎక్కువ రోజులు ఉండలేదని తనకు అబార్షన్ అయిందంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది సమీరా. దీంతో బుల్లితెర ప్రముఖులు అభిమానులు సైతం ఈమెకు చాలా ధైర్యాన్ని చెప్పారు.
2023లో ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంట్లో వారందరూ కూడా చాలా ఆనందపడ్డారు.. ముఖ్యంగా తన కుమారుడు అర్హన్ తన కడుపులో బిడ్డతో ఎక్కువగా మాట్లాడే వారిని తెలిపారు..రెగ్యులర్ చెకప్ లో భాగంగా రెండు సార్లు స్కానింగ్ కి వెళ్ళినప్పుడు బేబీ బాగానే ఉందని చెప్పారు.. కానీ 12వ వారానికి స్కానింగ్ వెళ్ళగా వారు ఎనిమిదో వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది అంటూ వైద్యులు చెప్పారట. ముఖ్యంగా తన బిడ్డ గుండె లోపలే కొట్టుకోలేదని చెప్పడంతో.. ప్రాణం లేని బిడ్డని నాలుగు వారాల పాటు మోసాను నా కలల్ని అన్ని కూడా కుప్పకూలిపోయినట్టుగా అనిపించిందని చాలా ఏడ్చాను.. ఆ తర్వాత కొన్ని రోజులకు టాబ్లెట్ ద్వారా గర్భంలో ఉండే శిశువుని బయటికి తీసారంటూ ఎమోషనల్ గా సమీరా ఒక వీడియోని షేర్ చేసింది. అయితే ఈమెకు ఇలా కావడం ఇదే మొదటిసారి కాదు 2020లో కూడా ఈమె గర్భం దాల్చినప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నదట సమీరా.