టివి: చరిత్రలో మొదటిసారి భర్తకే భరణం ఇచ్చిన బుల్లితెర నటి..!
అయితే ఇప్పుడు ఒక స్టార్ నటి తన భర్తకి రివర్స్ లో భరణం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది కూడా తన కుమార్తె కోసం ఈ ఆస్తిని వదులుకున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి శ్వేతాతివారి. 1998లో రాజా చౌదరి తో వివాహం కాగా.. కొన్ని రోజులు బాగానే ఉన్న ఆ తర్వాత రాజా ఎక్కువగా మధ్యానికి అలవాటపడడంతో గృహహింసతో తనని ఇబ్బందులు పెట్టేవారని తెలియజేసింది శ్వేతా తివారి. అలా ఐదేళ్లపాటు న్యాయపోరాటం చేసింది.
అయితే చివరకు రాజా చౌదరితో విడాకులు సెటిల్మెంట్లో భాగంగా రూ .93 లక్షల విలువైన భవనాన్ని కూడా ఆమె భరణంగా ఇచ్చేసిందట. తన కూతురు పలక్ తివారి కోసం ఆర్తిని కూడా లెక్క చేయలేదని వదులుకోవడానికి సిద్ధమయ్యింది. దీంతో ఇలా మొదటిసారి చరిత్రలోనే ఒక నటి తన భర్తకు భరణం కింద డబ్బులు ఇవ్వడం జరిగిందంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పైన శ్వేతా తివారి మాట్లాడుతూ తన కూతురు భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతోనే తాను ఇలా చేశానని తెలిపింది. మొత్తానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భర్త నుంచి కోట్ల రూపాయలు భరణం పొందుతున్న హీరోయిన్స్ కంటే ఈ నటి బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటీజన్స్.