251 రూపాయల ఫోన్ , రివ్యూ లు ఇలా ఉన్నాయి

KSK

ప్రపంచపు అతి తక్కువ ధర స్మార్ట్ ఫోన్ గా ఫ్రీడం 251 బాగా ఫేమస్ అయ్యింది. చాలా తక్కువ ధర కో స్మార్ట్ ఫోన్ ఇవ్వడం లో ఈ కంపెనీ చాలా పెద్ద సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కంపెనీ దాదాపు డబ్భై వేల యూనిట్ లని డెలివరీ చేసారు. ఇందులో బ్యాటరీ పుటప్ బాగుంది అంటున్నారు. చార్జింగ్ పెట్టిన దాదాపు రోజున్నర వరకూ మళ్ళీ చార్జింగ్ తో పని ఉండడం లేదు. బ్లూ టూత్ , వై ఫై లాంటివి బాగా నడుస్తున్నాయి. 8 జీబీ వరకూ మెమరీ ని ఇచ్చింది కంపెనీ.



ఫోన్ కి దగ్గరలో ఎలెక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ గనక ఉంటె వాటిని కనుక్కునే సెన్సార్ ఈ ఫోన్ లో ప్రత్యేకం. అన్లాక్ కోసం స్క్రీన్ మీద వేలు పెడితే సరిపోతుంది. ఇక సాధారణ విధానాల్లో బ్రౌజింగ్ , వాట్స్ యాప్ కాలింగ్ లు అన్నీ చక్కగా పని చేస్తున్నాయి. కెమెరా విషయం లోనే కాస్త ఇబ్బంది పడుతున్నారు జనాలు. కానీ రెండొందల యాభై కి ఇంతకంటే కష్టం. ముఖ్యంగా ఫోన్ వేడి ఎక్కకపోవడం సంతోషకర విషయం. ఈ ఫోన్ మీద రకరకాల వార్తలు షికారు చేసాయి , ఈ కంపెనీ జనాలని మోసం చేస్తోంది అనీ డబ్బు తీసుకుని ఉడాయిస్తారు అనీ వడ్డీకి తిప్పుకుని వెనక్కి పంపించేస్తారు అని రకరకాల వార్తలు వచ్చాయి గానీ చివరికి డెలివరీ లు మొదలు పెట్టడం తో జనం శాంతించారు. రివ్యూ లు కూడా బాగుండడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: