జియో వలన ఎయిర్టెల్ కి పెద్ద నష్టం ఏమీ లేదట
ముఖేష్ అంబానీ సృష్టించిన సునామీ జియో తో ఎన్ని కంపెనీలు టెలికాం రంగంలో ఉంటాయి, ఇంకెన్ని కంపెనీలు ఎగిరిపోతాయి అనేది పెద్ద డిస్కషన్ సాగుతోంది. రిలయన్స్ కి పోటీ ఇస్తూ అగ్రగామిగా ఉన్న ఎయిర్ టెల్ కి ఇది అతిపెద్ద ఇబ్బందిగా తయారయింది. జియో మార్కెట్ విపరీతంగా పెరిగింది, రిలయన్స్ స్టోర్ ల బయట జనాలు పడిగాపులు కాస్తూ కూడా సిమ్ కార్డ్ లని కొంటున్నారు. ఈ పరిస్థితి లో జియో మార్కెట్ కు వచ్చిన తరువాత ప్రధాన టెలికం సంస్థ ఎయిర్ టెల్ కు నష్టం తప్పకపోవచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, ఆపై తిరిగి నిలదొక్కుకుంటుందని భావిస్తున్నామని తెలిపింది. డేటా టారిఫ్ విభాగంలో నెలకొన్న పెను పోటీ, ఉచిత వాయిస్ కాల్స్ ఆఫర్లు తదితరాలు ఎయిర్ టెల్ నిర్వహణా లాభాలను దెబ్బతీయనున్నాయని పేర్కొంటూ, జియో ప్రవేశంతో భారత టెలికం రంగం కొంత అనిశ్చితిలో పడిందని, ఎయిర్ టెల్ దేశవాళీ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం మేరకు పడిపోవచ్చని అంచనా వేసింది. ఎయిర్ తెల కి జియో ఆవిష్కరణ తరవాత ఎలాంటి పోటీ పెరిగినా వారి సేఫ్టీ వారికే ఉంది అంటోంది ఈ కంపెనీ. " భారతీ ఎయిర్ టెల్ ఆర్ధిక స్థితి లో తీవ్ర మార్పులు ఏమీ రాలేదు. వారి ఆర్ధిక స్థితి బలంగానే ఉంది. జియో బ్రాండ్ పేరిట రిలయన్స్ 4 జీ ని చౌక ధరల్లో ఇవ్వడం ఎయిర్టెల్ కి పేని సవాల్ అనే చెప్పాలి కానీ రెండు మూడు సంవత్సరాల లో నిర్వాహణ నిధి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్వహణా నిధి 25.4 శాతం నుంచి 23 శాతానికి తగ్గవచ్చు. 20 శాతం కన్నా తగ్గితేనే ఎయిర్ టెల్ రేటింగ్ ను తగ్గించే ఆలోచన చేస్తాం" అని పేర్కొంది.