ఈ “మడత ఫోను”... రేటు తెలిస్తే “షాక్” అవుతారు..!!!

NCR

స్మార్ట్ మొబైల్ రంగంలో అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బడా బడా కంపెనీలు అన్నీ ఒకరితరువాత ఒకరిగా పోటీ పడుతూ ఈ పోటీ ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి ఎక్కాలని ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో ఫీచర్స్ తో వినియోగదారులకి కళ్ళు చెదిరేలా అధునాతన టెక్నాలజీని అందిస్తూ ఆకర్షిస్తున్నాయి..రేటు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటోంది.

 

అయితే తాజాగా దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్‌.. ప్రపంచ మార్కెట్ లోకి ఓ అధునాతన  మొబైల్ ని విడుదల చేసింది.ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే, ఫోన్ ని మడత పెట్టుకోవచ్చు. మొట్ట మొదటి సారిగా మార్కెట్ లోకి  ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

 

ఈ ఫోన్  “గెలాక్సీ ఫోల్డ్‌” పేరుతో వినియోగదారులకి అందుబాటులోకి ఏప్రిల్‌ నుంచి తీసుకురానుంది. అయితే ఇది రెండు రకాలుగా ఉపయోగపడనుంది ఎలా అంటే, ఒక వైపు ట్యాబ్ లా మరో వైపు ఫోన్ లాగా కూడా పని చేస్తుంది. 5జీ నెట్‌వర్క్‌ తో పనిచేయగలిగే కెపాసిటీ ఉన్న ఈ మొబైల్  డిస్‌ప్లే సైజ్‌ 4.6 అంగుళాలు..అయితే మదతని గనుకా విప్పితే  7.3 అంగుళాల ట్యాబ్ లా మారుతుంది. అయితే ఈ ఫోన్ ధర మాత్రం..అక్షరాలా  రూ.1.4 లక్షలు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: