మొన్న జరిగిన భారత్ అంతరిక్ష ప్రయాణం చంద్రయాన్-2 గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఇస్రో సాధించిన ఈ ఘనతను భారత దేశ ఖ్యాతి ఎంతగానో పెరిగిపోయింది.జూలై 22 నింగిగేగిసింది చంద్రయాన్-2 మాత్రమే కాదు భారత దేశ పేరు ప్రఖ్యాతలు కూడా.
ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న ఈ అంతరిక్ష ప్రయాణాన్ని మన భారత దేశ శాస్త్రవేత్తలు తమ మేదో శక్తితో విజయవంతంగా పూర్తి చేశారు.అటు పారిశ్రామిక రంగంలో,సాంకేతిక రంగంలో మన దేశం అభివృద్ధి పధంలో పయనిస్తోంది. దీన్ని చూసి దాయాది దేశాలకు భారత్ అంటే వణుకు పుడుతుంది. మనతో పోటీ అంటే ఎప్పుడు ముందుండే పాకిస్థాన్ కూడా ఇప్పుడు అంతరిక్ష ప్రయాణానికి సై అంటుంది.
పాకిస్తాన్ 2022లో మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు ఆ దేశ శాస్త్ర, సాంకేతిక మంత్రి ఫవాద్ చౌదరి ప్రకటించారు. చైనా శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ద్వారా ఈ ప్రయోగం చేయనున్నట్లు వెల్లడించారు. వ్యోమగాములు ఎంపిక ప్రక్రియ 2020 ఫిబ్రవరి నుంచి ప్రాణం ఇస్తున్నామని తెలిపారు. 50 మందిని ఎంపిక చేసి వీరి నుంచి 25 మందిని షార్ట్ లిస్ట్ చేస్తాం అని చెప్పారు. తర్వాత 2022లో అంతరిక్షంలోకి ఒకరి పంపుతామని ఆయన అన్నారు.