జియో గిగాఫైబర్ సేవలు పొందాలంటే...!!!
టెలికం దిగ్గజం రిలయన్స్
జియో కొన్ని రోజుల క్రితం ప్రకటించిన గిగాఫైబర్ ఎంతటి సంచలనం సృష్టించిందో
ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు వినియోగదారులకి అందుబాటులోకి ఈ సేవలు
వస్తాయో అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా
ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని మరీ చూడచ్చు, వర్చ్యువల్ షాపింగ్ కూడా చేయచ్చు అని
ముకేష్ అంబాని ప్రకటించడం దేశ వ్యాప్తంగా ఈ సేవలకోసం ఎదురు చూసేలా చేస్తోంది.
ఈ సేవలు పొందటానికి రూ 700 మొదలు 10 వేల నెలవారీ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని జియో ప్రకటించింది. ఇక దీని ఇంటర్నెట్ స్పీడు విషయానికి వస్తే 100 ఎంబీపీఎస్ నుంచీ 1జీబీపీఎస్ వరకూ లభ్యం కానుంది. అయితే మరి ముందుగానే ఈ సేవలు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాఅంటే..
- జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ వెబ్సైటు : https://gigafiber.jio.com/registration ఓపెన్ చేయాలి.
- ఈ సేవలని పొందాలనుకునే వారు తమ చిరునామాని ఎంటర్ చేయాలి.
- అందులోనే ఈ మెయిల్ , ఫోన్ నెంబర్ వివరాలు కూడా నమోదు చేయాలి.
- ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఫోన్ నెంబర్ కి ఒటీపీ వస్తుంది దాన్ని సరి చూసుకోవాలి.
- చివరిగా మీరు ఎంటర్ చేసిన వివరాలు సరి చూసుకుని జియో ఫైబర్ నెట్ కనెక్షన్ ఇస్తారు.