నేడు వివో సంస్థ నుండి వివో యు10 ఫోన్ విడుదల
అంటే, ఈ మొబైల్ విడుదల కావడానికన్నా ముందే ఈ ఫోన్లో ఎటువంటి స్పెక్స్ అందుకోనున్నామో తెలిసిపోయింది.వివో ఇండియా దాని అధికారిక వెబ్సైట్లో ప్రోమో ద్వారా ఈ స్పెక్స్ ను విడుదలచేసింది. దీని ద్వారా, ఈ మొబైల్ ఫోన్లో ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ ఈ ఫోను పొందబోతునట్లు సమాచారం, దీనికి తోడు మీకు ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్ కూడా లభిస్తుంది. అలాగే, మీరు ఈ ఫోన్లో ఒక 6.35-అంగుళాల HD + నోచ్ స్క్రీన్‌ను కూడా పొందుతారు.
అలాగే, వివో యు10 కెమెరా గురించి కూడా సమాచారం వెలువడింది.13MP + 8MP + 2MP లెన్స్ యొక్క కాంబోతో ఈ ఫోన్లో మీరు ట్రిపుల్ కెమెరా సెటప్ అందుకొనునట్లు చెప్పొచ్చు. ఇక ఫోన్ వెనుక భాగంలో ఒక వేలిముద్ర సెన్సార్‌ను కూడా ఇస్తోంది. ఇది కాకుండా, ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా లభిస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుంది. అయితే, ఇది మాత్రమే కాదు, మీరు ఫోన్లో అల్ట్రా-గేమ్ మోడ్‌ను కూడా అందుకుంటారు.
అయితే, వివో యు10 లో మీరు వాయిస్ ఛేంజర్ మరియు 4D వైబ్రేషన్ వంటి ఫీచర్లను కూడా అందుకోన్నారు. వివో యు 10 స్మార్ట్‌ఫోన్‌ను ఎలెక్ట్రి బ్లూ, థండర్ బ్లాక్ రంగుల్లో లాంచ్ చేయవచ్చు, ఈ మొబైల్ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా అమ్మబోతోంది. ఈ ఫోన్ ప్రారంభించిన తర్వాతే దాని ధర మరియు దాని లభ్యత గురించి మీకు సమాచారం లభిస్తుంది.