
శాంసంగ్ తాజా స్మార్ట్ ఫోన్...అక్షరాలా 1.75 లక్షలు..ప్రత్యేకత ఏమిటంటే...!!!
ఇప్పుడు మార్కెట్ లోకి
కుప్పలు తెప్పలుగా రోజుకో కంపెనీ పేరుతో స్మార్ట్ ఫోన్ లు వచ్చేస్తున్నాయి. కంపెనీ
పేరు చెప్పాలంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ శాంసంగ్ మొబైల్ గురించి తెలియని వాళ్ళు బహుశా ఈ టెక్
ప్రపంచంలో ఎవరూ ఉండరేమో. శాంసంగ్ బ్రాండ్ మొబైల్ కి అంత క్రేజ్ ఉంది. తమ వినియోగ
దారుల అభిరుచులు తెలుసుకుంటూ, మార్పు చెందుతున్న కాలానికి టెక్నాలజీ కి అనుగుణంగా స్మార్ట్
ఫోన్ లని సిద్దం చేయడంలో శాంసంగ్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే శాంసంగ్ అధునాతన టెక్నాలజీతో ఫోల్డ్ ( మడత ) ఫోన్ ని
ప్రవేశపెట్టింది.
శాంసంగ్ కి చెందిన మడత పెట్టగలిగే ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ ని అక్టోబర్ 1 నుంచీ భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఈ మొబైల్స్ అదే రోజు నుంచీ వినియోగ దారులకి అందుబాటులోకి రానున్నాయని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ ఫోన్ ధర తెలిస్తే మాత్రం కళ్ళు గిర్రున తిరగక మానదు. ఈ ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా..
శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ధర సుమారు 1.50 లక్షల నుంచీ రూ 1.75 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే. కేవలం ఈ ఫోన్ విక్రయం ఫ్రీ –బుకింగ్ ద్వారా మాత్రమే బుక్ చేయడం జరుగుతుందని సంస్థ తెలిపింది. అయితే ఈ ఫోన్ తాకే తెర 7.3 ప్రైమరీ డిస్ప్లే కాగా 4.6 ఇంచుల తో సెకండరీ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. అంతేకాదు 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ యొక్క కెమెరా , మరిన్ని ఫీచర్స్ తెలుసుకోవాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.