'వాట్సప్' ఇప్పుడు ఈ యాప్ లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు. ఒకప్పుడు మెసెజ్ పెట్టాలంటే రూపాయి కట్టవుతుంది అది ఇది అని ఆలోచించే ప్రజలు ఇప్పుడు క్షణాల్లో వంద మెసెజ్ లను పెట్టేస్తుతున్నారు. ఇది ఎవరి వల్ల జరిగింది. వాట్సాప్ అనే ఒక యాప్ వల్ల. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న, తెలపాలన్న మనం ఉపయోగించేది వాట్సాప్. ఇప్పుడు ప్రతిది వాట్సాప్ వల్లే జరుగుతుంది.
అయితే వాట్సప్ లో ఎప్పటికప్పుడు కొత్తగా తయారవుతుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ ని రిలీజ్ చేస్తూ యాప్ యూజర్లను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇలా ఒక్కసారి కాదు.. వాట్సాప్ నిర్వాహకులు ఎప్పుడు కొత్త కొత్త ఫీచర్లపై పరిశోధనలు చేసి వాటిని యూజర్ల ముందు రిలీజ్ చేస్తుంటారు. ఆ మార్పులతో వాట్సాప్ వినియోగదారులు అంత ఆనందపడుతారు.
ఆలా యూజర్లకు మరో సంతోషాన్ని ఇచ్చేనందుకు వాట్సాప్ రెడీ అయ్యింది. అది ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి. మనం ఏదైనా వాట్సాప్ మెసెజ్ ఇప్పుడు ఒక గంటలో ఇద్దరి వైపు డిలేట్ చేసుకోవచ్చు కదా. అయితే ఆ మెసెజ్ డిలీట్ చేసిన అటు వైపు డెలీట్డ్ అని పడుతుంది. కానీ ఇప్పుడు ఆలా కాదు కొత్తగా ఓ ఫీచర్ తెచ్చిపెటింది వాట్సాప్. ఇప్పుడు కొత్తగా 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా 2.19.275 వర్షన్‌లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు. మరి ఈ ఫీచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.