బడ్జెట్ ధరల్లో స్మార్ట్ఫోన్లు అందించే చైనా దిగ్గజ సంస్థ షియోమీ నుంచి త్వరలో మరో కొత్త మొబైల్ రాబోతుంది. వెనుక వైపు ఐదు కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్ ఫోన్‌ను నవంబర్ 5 న విడుదల చేసేందుకు షియోమీ సిద్ధమైంది. సీసీ9 ప్రోకు సంబంధించి పూర్తి ఫీచర్లను షియోమీ వెల్లడించలేదు. మీటూ సంస్థ భాగస్వామ్యంలో వచ్చిన సీసీ స్మార్ట్ ఫోన్ల సిరీస్ లో సీసీ9 ప్రో మూడోది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో సీసీ9, సీసీ9 ఈ ఫోన్లను షియోమీ విడుదల చేసింది.
సీసీ9ఈ ను ప్రపంచ మార్కెట్లో ఎంఐ ఏ3 ఆండ్రాయిడ్ వన్ పేరుతో విడుదల చేసింది. సీసీ9 ప్రోను ఏ3 ప్రోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. 6జీబీ ర్యామ్ - 128 జీబీ రామ్, 8 జీబీ ర్యామ్ - 128జీబీ రామ్, 8జీబీ ర్యామ్ - 256 జీబీ వేరియంట్లలో లభించనుంది.
ఇది ఇలా ఉండగా అధికారిక సమాచారం ప్రకారం సీసీ9 ప్రోలో కెమెరా పై షియోమీ ప్రధానంగా దృష్టి సారించింది. వెనుకవైపు 5 కెమెరాలను ఇందులో పొందుపరిచింది. ప్రధాన కెమెరాలో శాంసంగ్ రూపొందించిన 108 మెగాపిక్సల్ సెన్సార్‌ను అమర్చింది. ఫొటో బ్యాక్‌గ్రౌండ్ స్పష్టత కోసం 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 8ఎంపీ టెలిఫొటో లెన్స్, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్లనూ పొందుపరిచింది. ఒప్పో రెనో ఫోన్ల తరహాలో 5 రెట్లు ఆప్టికల్ జూమ్ ఆప్షన్ కూడా షియోమీ ఇచ్చింది. మార్కెట్లో ప్రస్తుతానికి 5 కెమెరాలున్న స్మార్ట్ ఫోన్ నోకియా 9 ప్యూర్‌వ్యూ మాత్రమే.
ఇక ఏఏ ఫోన్ విషయానికి వస్తే ప్రత్యేకతలు ఏఏ విధంగా ఉన్నాయి. 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోఎల్ఈడీ తెర, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ చిప్సెట్, 108ఎంపీ వెనుక ప్రధాన కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యం-4000 ఎంఏహెచ్ ఇక ధర విషయానికి వస్తే ధర రూ.16,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు.