టెక్నాలజీ: రియల్‌మీ ఫోన్ వాడుతున్నారా.. ఇక మీకు ఈ తిప్పలు తప్పవు..
ఈ మధ్య కాలంలో రియల్‌మీ ఫోన్లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది ఈ ఫోన్లను కొనడానికి ఇష్టపడుతున్నాయి. అయితే మీకు ఓ చేదు వార్త అని చెప్పాలి. షావోమీ స్మార్ట్‌ఫోన్లల్లో యాడ్స్ వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. షావోమీ ఈ వ్యూహాన్ని ఎప్పట్నుంచో పాటిస్తోంది. రెండుమూడేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్ పోస్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. కానీ... రియల్‌మీ మాత్రం తమది అలాంటి వ్యూహం కాదని మొదట్లోనే ప్రకటించింది. మేము స్మార్ట్‌ఫోన్లు మాత్రమే అమ్ముతాం యాడ్స్ కాదంటూ ప్రకటించింది.
అయితే తాజాగా రియల్‌మీ కంపెనీ కూడా తమ వ్యాపార వ్యూహాన్ని మార్చేసింది. స్మార్ట్‌ఫోన్లలో యాడ్స్ పోస్ట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించే బాటలో నడుస్తోంది. షావోమీ స్మార్ట్‌ఫోన్లలాగానే ఇకపై రియల్‌మీ ఫోన్లల్లో కూడా యాడ్స్ కనిపించబోతున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ రానున్నాయి. కలర్ ఓఎస్ అప్‌డేట్ చేసిన తర్వాత రియల్‌మీ ఫోన్‌లో యాడ్స్ కనిపించనున్నాయి. అయితే యాడ్స్ అనే పేరుతో కాకుండా 'కంటెంట్ రికమండేషన్స్' పేరుతో ఈ యాడ్స్ చూపించనుంది రియల్‌మీ. దీంతో ఇప్పుడు రియల్‌మీ ఫోన్లల్లో యాడ్స్ రావడం యూజర్లకు ఊహించని షాకే అని చెప్పాలి.
మరి ఈ రియల్‌మీ ఫోన్లల్లో యాడ్స్ ఆపేయాలంటే.. అయితే యాడ్స్ వద్దనుకుంటే డిసేబుల్ చేసే ఆప్షన్ ఇస్తోంది రియల్‌మీ. ఇందుకోసం మీరు సెట్టింగ్స్ మారిస్తే సరిపోతుంది. ఒకవేళ రియల్‌మీ పోస్ట్ చేసే యాడ్స్ లేదా 'కంటెంట్ రికమండేషన్స్' మీరు చూడొద్దనుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అందులో అడిషనల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేస్తే గెట్ రికమన్‌డేషన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి బటన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీకు కంటెంట్ రికమండేషన్స్ కనిపించవు.