వాట్సాప్‌లో ఎవ్వరికి తెలియని సీక్రెట్ ఫీచర్.. మీరూ ఫాలో అవ్వండి..!
అక్కడ బ్లూ టిక్స్ ఉంటే అవతలి వాళ్లు మన మెసేజ్ చదివారో లేదో తెలిసిపోతుంది. ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్ చదివారో లేదో తెలుసుకోవటం కష్టం. ఇక ఈ ఫీచర్ వాట్సాప్ 2014లో అమల్లోకి తీసుకు వచ్చింది. ఆ తర్వాత వాట్సాప్ వన్ టిక్ ఆప్షన్ తీసుకు వచ్చింది. ఎదుటి వ్యక్తికి మన మెసేజ్ చేరగానే వన్‌టిక్ పడుతుంది.
అయితే బ్లూ టిక్ ఆప్షన్ ఆఫ్ చేసి ఉంటే మన మెసేజ్ అవతలి వాళ్లు చదివారో లేదో తెలియదు. అయితే ఇలా కాకుండా ఆ వ్యక్తి మీ వాయిస్ రికార్డింగ్ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్ పడిపోతాయి. అతడు బ్లూటిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసినప్పటికి వాయిస్ మెసేజ్ విన్నప్పుడు మాత్రం బ్లూటిక్స్ పడిపోతాయి. ఇది వాట్సాప్‌లో ఉన్న చిన్న మిస్టేక్. అయితే దీనిని ఎవ్వరూ పెద్దగా ఫాలో అవ్వరు. ఇక ఇలా చేస్తే అవతలి వ్యక్తి మెసేజ్ ఆప్షన్ ఆఫ్‌లో పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు.