టెక్నాల‌జీ: మీ కంప్యూటర్ నెమ్మదించటానికి కార‌ణాలు ఇవే..!!

Kavya Nekkanti

నేటి స‌మాజంలో కంప్యూటర్‌ లేకుంటే ఎలాంటి పనులు కావడం లేదు. నిత్యం మనం చేసుకునే పను లు కంప్యూటర్‌తో ముడిపడి ఉంటాయి. ఒక్కోసారి  అత్యవసరంలో కంప్యూటర్‌లు మొరాయిస్తే అనుకున్న సమయంలో పనులు కావు. అయితే సాధార‌ణంగా ఎక్కువ శాతం మంది తమ కంప్యూటర్ చాలా పాతది అని.. అందుకే వేగముగా పని చేయలేక పోతున్నామని బాధ పడుతుంటారు. అయితే కంప్యూట‌ర్ పాత‌ది అయిపోయినంత మాత్రాన స్లో అవ్వ‌దు. ఇత‌రిత‌ర త‌ప్పులు వ‌ల్ల కూడా కంప్యూట‌ర్ ప‌నితీరు నెమ్మ‌దించ‌టానికి కార‌ణం అవుతాయి. అవేంటో చూసేయండి.

 

మీ పీసీ డెస్క్‌టాప్‌ను వీలైనంత వరకు క్లీన్‌గా ఉంచండి. యానిమేటెడ్ వాల్ పేపర్లు, స్ర్ర్కీన్ పేపర్లు కంప్యూటర్ వేగాన్ని పూర్తిగా తగ్గించివేస్తాయి. మీ పీసీని ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేస్తుండాలి. పీసీ నెమ్మందిచడానికి పాత సాఫ్ట్‌వేర్‌ కూడా ఓ కారణం అవుతుంది. అలాగే మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

 

సీ డ్రైవ్ అలానే ఆపరేటింగ్ సిస్టం పై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల కంప్యూటర్ వేగం నిదానిస్తుంది. సో.. ఈ రెండింటి పై ఒత్తిడి పడకుండా చూసుకోండి. అదేవిధంగా, పీసీలోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. లేకుంటే పీసీ పనితీరు క్ర‌మంగా త‌గ్గిపోతుంది. మ‌రియు పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. దీని వ‌ల్ల కూడా కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది. కాబ‌ట్టి ఈ విష‌యంలోనూ జాగ్ర‌త్త వ‌హించాలి.

 
  
 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: